కరోనా వైరస్ కు వ్యతిరేకంగా టీకా : తాజా వివరాలు

2020 దాదాపుగా ముగిసింది. కానీ కరోనా వైరస్ మహమ్మారి మాత్రం వ్యాప్తి చెందుతూనే ఉంది.
కానీ ఒక శుభవార్త ఏమిటంటే టీకా విషయంలో పురోగతి కనిపిస్తుంది.
2021 ప్రారంభంలో కరోనా వైరస్ కోసం వ్యాక్సిన్ తయారయ్యే అవకాశం ఉంది. దాదాపు ఐదు కంపెనీలు కరోనా వైరస్ వ్యాక్సిన్ గురించి ఫలప్రదమైన మరియు విజయవంతమైన పరిశోధనల గురించి మాట్లాడారు.
ముందుగా కోవిడ్ 19 వ్యాక్సిన్ యొక్క పరిణామాలను పరిశీలిద్దాం..
మోడర్నా : 94.5% సమర్ధత రేటుతో వ్యాక్సిన్ ను ప్రకటించింది.
మోడర్నా యొక్క ఎం-ఆర్ఎన్ఏ వాక్సిన్
కొవిడ్- 19 వ్యాక్సిన్ ఇటీవల మార్కెట్లో గొప్ప పోటీదారు అయింది. ఈ సంస్థ వారి అధ్యయన ఫలితాలను ప్రకటించింది. ఈ టీకా 94.5 శాతం ప్రభావవంతంగా ఉంటుందని ఈ సంస్థ పేర్కొన్నది. ఇతర టీకా సంస్థలతో పోల్చినప్పుడు ఇది అత్యధిక సమర్థమైన రేటు. మోడర్నా యొక్క తాజా నివేదిక వాస్తవానికి ఈ ప్రపంచ మహమ్మారిపై పోరాటానికి ఒక ఆశా కిరణం అయింది.
మోడర్నా యొక్క టీకా ప్రస్తుతం మనకి సురక్షితమైనదా ?
కచ్చితంగా ఈ టీకా వలన పెద్దగా దుష్ప్రభావాలు ఏమీ లేవు. మరియు అది ఎంతో సురక్షితమైనది సూచిస్తున్నారు. టీకా తయారీదారులు రాబోయే నెలల్లో 20 మిలియన్ల మోతాదులను సరఫరా చేసే ప్రణాళికలు ప్రకటించారు. వీటిని నిల్వ చేయడానికి అతి చల్లని ఉష్ణోగ్రతలు అవసరమవుతాయి అని, మరియు 30 రోజుల పాటు రిఫ్రిజిరేటర్ లో స్థిరంగా ఉంటాయి అని సూచించారు. వీటిని ఎక్కువ కాలం ఉపయోగించడానికి రవాణా కూడా చేయవచ్చు. ఇది విభిన్న దేశాలకు కూడా అందుబాటులో ఉంటుంది.
ఫైజర్స్ : వ్యాక్సిన్ సురక్షితమైనది. కానీ డెలివరీ మరియు నిర్వహణ కష్టతరంగా కనిపిస్తుంది.
ఈ టీకా ప్రస్తుతం మూడవ దశలో ఉంది. ఇది పరీక్ష యొక్క క్లిష్టమైన దశ. ఈ దశలో 90 శాతం సురక్షితమైనది గా కనుగొనబడింది.
ఇది వృద్ధులకు, హైరిస్క్ ఉన్న వారిలో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇప్పటివరకు ఎటువంటి దుష్ప్రభావాలను గమనించడం లేదు.
ఫైజర్ టీకా తో ఉన్న సమస్య ఏమిటంటే ధర మరియు నిలవ చేయడం. ఈ టీకా కంపెనీకు సరఫరా సదుపాయము అవసరం. వీటిని అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నీల్వ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫైజర్ కు మోతాదును సరఫరా చేయడంలో కూడా దేశాల పరంగా కొన్ని పరిమితులు ఉన్నాయి.
కో వాక్సిన్ : మూడవ దశ పరీక్షలోనికి ప్రవేశించింది..
భారత్ బయోటెక్ మద్దతు ఉన్న కోవ్యాక్సిన్ ప్రారంభదశలో భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం భారతదేశంలోని వివిధ కేంద్రాలలో మూడవదశ అధ్యాయనంలో ప్రవేశిస్తుంది. మూడవ దశ విచారణలో దాదాపు 26 వేల మంది వాలంటీర్ల ప్రమేయం కనిపిస్తుంది. ఐసిఎంఆర్ సహకారంతో ఇది జరుగుతుంది.
కో వ్యాక్సిన్ వైరస్ యొక్క క్రియారహిత సంస్కరణను ఉపయోగించి తయారు చేయబడింది. ఇది మొదటి దశ మరియు రెండవ దశ అధ్యయనాలలో అంటు వ్యాధులను నివారించడానికి సురక్షితంగా మరియు ప్రభావవంతంగా పని చేస్తున్నట్లుగా కనుగొనబడింది. కో వ్యాక్సిన్ యొక్క సమర్ధత రేట్లు మరియు డెలివరీ సమయపాలన వారు వాగ్దానం చేసిన విధంగా అంతర్జాతీయ స్థాయికి సరిపోతున్నాయి. కానీ వ్యాక్సిన్ ఎప్పుడు సిద్ధమవుతోంది అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
మరో భారతీయ తయారీదారు జై కావ్ - డి కూడా త్వరలో మూడవ దశ ట్రైల్స్ కు వెళ్లనుంది.
వీటితో పాటుగా వ్యాక్సిన్ తయారీదారులైయిన బయోలాజిక ఈ కూడా ప్రయోగాత్మక కోవిద్ -19 వ్యాక్సిన్ లలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తుందని భావిస్తున్నారు. అది మాత్రమే కాదు ! భారత్ బయోటెక్ గ్లోబల్ సంస్థ ప్రత్యేకమైన నసల్ కొవిడ్ వ్యాక్సిన్ తయారీకి కూడా కృషి చేస్తుంది.
రష్యన్ టీకా స్పుత్నిక్ వి :
రష్యాకు చెందిన ప్రతిష్టాత్మక కొవిద్-19 వాక్సిన్ తయారీ కోసం నమోదు చేయబడిన వాటిలో మొదటిది. ఇది చివరకు భారతదేశ తీరంలో అడుగుపెట్టనుంది. ఈ టీకా మొదటిసారిగా కాన్పూర్లోని వైద్య సదుపాయాలకు చేరుకోనుంది. అక్కడ కొన్ని వారాలపాటు దీని పరీక్ష మరియు పర్యవేక్షణలో ఉంటుంది.
స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఇప్పటికే రష్యాలోని కొన్ని సమూహాలకు ఇవ్వబడింది. ఇది రెండు రూపాల్లో ఉత్పత్తి అవుతుంది. ఒకటి ద్రవరూపంలో మరొకటి ఘన రూపంలోనూ ఉత్పత్తి అవుతుంది. ద్రవ రూపాన్ని 18 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. ఘన రూపంలో ఉన్న దానిని అతి తక్కువ (2-8 డిగ్రీల సి) ఉష్ణోగ్రతలలో నిల్వ చేయాలి.
రెండవ దశ మరియు మూడవ దశ పూర్తి అయిన తర్వాత మార్చి లేదా ఏప్రిల్ నెల నాటికి భారతదేశంలో లభిస్తుంది.
ఆక్స్ఫర్డ్ - ఆస్ట్రాజనేక్ : డిసెంబర్ నాటికి 100 మిలియన్ల మోతాదు
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ద్వారా భారతీయులు కరోనా వైరస్ వ్యాక్సిన్ పొందవచ్చని ఆశిస్తున్నారు. ఆక్స్ఫర్డ్ తయారుచేసిన ఈ వ్యాక్సిన్ భద్రత విషయంలో సమాచారం కోసం ఇంకా ఎదురు చూస్తుంది. ఆక్స్ఫర్డ్ భాగస్వామి అయిన పూనే కి సంబంధించిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మాత్రం 100 మిలియన్లకు పైగా ప్రయోగాత్మక డోస్ లు తయారు చేయబడతాయి అని ప్రకటించారు.
ఆరోగ్య ప్రాతిపదికన టీకాలు వేసే ఆరోగ్య కార్యకర్తలు మరియు సిబ్బంది యొక్క జాబితాను కూడా ప్రభుత్వ అధికారులు సిద్ధం చేస్తున్నారు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మాత్రం కనీసం 50 శాతం మోతాదును భారత దేశము మరియు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందరికీ అనుకూలమైన ధరకే అందుబాటులోకి వస్తుందని హామీ ఇచ్చింది.
Be the first to support
Be the first to share
Comment (0)
Related Blogs & Vlogs
No related events found.
Loading more...