మీ పిల్లల మలం గురించి విశ్లేషి ...
మీ పిల్లల మలం గురించి విశ్లేషించేందుకు చిట్కాలు... మీ శిశువు మలం మీకు ఏమీ తెలియజేస్తుంది..

మొదటి సారిగా తల్లి అయినప్పుడు, మంత్రసానులు నా బిడ్డ యొక్క మలం గురించి పరిశీలించమని, అది బిడ్డ యొక్క ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని నాకు చెప్పారు. అప్పుడు అది నాకు కొంచెం అర్థరహితంగా అనిపించింది. అయినప్పటికీ, కొన్ని వారాలు మరియు నెలలపాటు పాప మలవిసర్జన చేసిన ప్రతిసారి డైపర్ ను పరిశీలించడం మొదలుపెట్టాను. నేను, మరోవైపు నా భర్త మతిస్థిమితం కోల్పోయినట్లుగా ప్రతిసారి పరిశీలించేవారము. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మా బాబు పుట్టిన సమయానికి, పిల్లల మలం చూసి ఆరోగ్యాన్ని అంచనా వేయడం ఎలాగో మరియు ఎలా అర్థం చేసుకోవాలో నేను బాగా తెలుసుకున్నాను.
పిల్లల మలాన్ని విశ్లేషించడం :
కొత్తగా తల్లిదండ్రులు అయిన వారు తమ బిడ్డ యొక్క మలాన్ని విశ్లేషించడానికి మరియు ఎప్పుడు ఎలాంటి అనుభూతి పొందుతున్నారు అనేదాని గురించి తెలుసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న ఆర్టికల్ ఇవ్వబడింది. దీనిని జాగ్రత్తగా పరిశీలించండి..
పసిపిల్లల మలం లేదా మెకోనియం :
మెకోనియం అని కూడా పిలువబడే నవజాత శిశువు యొక్క మలం సాధారణంగా ముదురు రంగులో ఉంటుంది. మరియు ఆకుపచ్చ , నలుపు రంగులో కూడా కనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా ఇది చాలా సాధారణం. బిలిరుబిన్ కారణంగా ముదురు రంగు వస్తుంది . మరియు ఎర్రరక్తకణాల కారణంగా పసుపు మరియు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది పలచగా కూడా ఉంటుంది. ఇది కూడా చాలా సాధారణం.
ఏమి చేయాలి ?
మెకోనియం అన్నది తాత్కాలికమైనది. మరియు సాధారణంగా మీ బిడ్డ పుట్టిన మొదటి మూడు రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత మలం పసుపు రంగులోకి మారుతుంది.
పసుపు రంగు విత్తనాల వలె :
తల్లిపాలు తాగే పిల్లలకు మలం కొంచెం వాసనతో , నీరు లాగా మరియు పసుపు రంగు గింజల వలె ఉంటుంది. ఇది విరోచనాలలాగా అనిపించవచ్చు. కానీ, ప్రత్యేకంగా పాలు తల్లిపాలు తాగే పిల్లలకు ఇది చాలా సాధారణం.
ఏమి చేయాలి?
ఏమి చేయవలసిన అవసరం లేదు! భయపడకుండా మీ బిడ్డకు పాలు ఇవ్వడాన్ని కొనసాగించండి.
గట్టిగా మరియు ముదురు రంగులో :
తల్లిపాలు తాగే పిల్లలతో పోల్చినట్లయితే ఫార్ములా పాలుతాగే పిల్లలలో సాధారణంగా మలం ముదురు రంగులో ఉంటుంది. మరియు గట్టిగా ఉండి గోధుమ రంగులో ఉంటుంది.
ఏమి చేయాలి?
చింతించవలసిన అవసరం లేదు. మీరు మీ శిశువు యొక్క ఆహార అలవాట్లను కొనసాగించవచ్చు . మీరు కొత్తగా ఫార్ములా పాలకు మారినట్లయితే మీ బిడ్డ యొక్క స్థితిలో మార్పు రావచ్చు . కానీ అది రెండు మూడు రోజులలో క్రమబద్ధీకరించబడుతుంది.
ఆకుపచ్చ గోధుమరంగు :
మీరు ఘనాహారం అలవాటు చేసినప్పుడు మీ బిడ్డ యొక్క మలం ఆకుపచ్చ గోధుమ రంగుకు మారవచ్చు. మీ బిడ్డకు ఐరన్ సప్లిమెంట్ ను ఇస్తున్నప్పుడు కూడా అలా జరుగుతుంది. ఇది కూడా చాలా సాధారణం.
ఏమి చేయాలి ?
ఈ మలం చాలా సాధారణమైనదిగా పరిగణించబడుతుంది. మీ బిడ్డకు జలుబు, జ్వరం లేదా బాగా అలసట వంటి ఇతర లక్షణాలు మీరు గమనించినట్లయితే వైద్యుని సంప్రదించవచ్చు.
మరింత తెలుసుకోండి...
పిల్లల మలం విషయంలో జాగ్రత్త వహించాల్సిన విషయాలు: వైద్యుని ఎప్పుడు సంప్రదించాలి?
మీ పిల్లల డైపర్ లో ఉన్న మలం ను చూసి మీరు వారి ఆరోగ్యం గురించి ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. మీ శిశువు యొక్క మలం వివిధ రకాల ఆకృతి, రంగు మరియు వాసనలు కలిగి ఉంటుంది. అయితే ఈ క్రింది సంకేతాలను కలిగి ఉన్నట్లయితే సలహా కోసం వైద్యుని సంప్రదించ వలసిన అవసరం ఉంటుంది.
గోధుమరంగు, పలచగా మరియు నీటిలాగా:
మీ బిడ్డకు అప్పుడప్పుడు గోధుమరంగులో నీటి లాగా మలవిసర్జన జరగవచ్చు. మరియు ఇది ఆందోళనకు కారణం కాదు. కానీ వారి డైపర్ మీద శ్రద్ధ ఉంచండి. పలచగా అయ్యే మలవిసర్జన రెండు రోజులు అంతకంటే ఎక్కువకాలం కొనసాగితే పిల్లలకు అసౌకర్యము. ఆకలి లేకపోవడం మరియు ఎంతో నీరసంగా ఉన్నట్లయితే.. అవి విరోచనాలు కావచ్చు. ఇది అతి సారానికి సంకేతము మరియు ఇది నిర్జలీకరణకు దారి తీస్తుంది. ఇటువంటి విరోచనాలు రెండు రోజులకు మించి ఉంటే మీ శిశువైద్యుని సంప్రదించండి.
పొడి మరియు గట్టిగా రాయిలాంటిది :
మలం గట్టిగా ఉంది అంటే మీ బిడ్డకు మలబద్దకం ఉంది అని సూచిస్తుంది. అప్పుడప్పుడు పలచగా ఉండే మలం సాధారణమైనట్లే అప్పుడప్పుడు గట్టిగా ఉండే మలం కూడా సాధారణం. ప్రత్యేకమైన కారణం లేకపోయినా ఘన పదార్థాలకు అలవాటు చేసినప్పుడు మీ బిడ్డకు మలబద్ధకం రావచ్చు. మీ శిశువు యొక్క మలబద్ధకాన్ని తగ్గించడానికి కొంచెం కొంచెం తల్లిపాలను లేదా ఫార్ములా పాలను ఇవ్వండి. కొంచెం పెద్ద పిల్లలకు అయితే కొంచెం కొంచెం గా అప్పుడప్పుడు నీటిని ఇస్తూ ఉండండి. కొత్తగా ఘన పదార్థాలు మొదలుపెట్టిన పిల్లలకు మలబద్ధకం రాకుండా ఉండడానికి ఎక్కువ ఫైబర్ ఉండే కాయగూరలు మరియు పండ్ల వంటి ఆహారాన్ని ఇవ్వండి.
ఆకుపచ్చని సన్నని తీగలాంటిది :
ఆకుపచ్చరంగులో సన్న తీగలాగా ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ కు సంకేతం కావచ్చు. అలా ఉన్నట్లయితే వైద్యుని సంప్రదించండి.
తెల్లగా, సుద్దలాగా :
శుద్ధ తెలుపు లేదా బూడిద రంగులో మలం ఉన్నట్లయితే మీ బిడ్డకు ఆహారం సరిగ్గా జీర్ణం కావటం లేదు అని సంకేతం. పిత్తం అనేది కాలేయంతో తయారు చేయబడే జీర్ణ రసం. కాలేయం సరిగ్గా పని చేయక పిత్తం ను ఉత్పత్తి చేయనట్లయితే మలం యొక్క రంగు తెలుపులోకి మారుతుంది. దీనికి తక్షణమే డాక్టర్ను సంప్రదించి వలసిన అవసరం ఉంటుంది.
అసాధారణమైన వాసన :
మలం కొంచెం వాసన కలిగి ఉంటుంది. అయినప్పటికీ ,వాసన చాలా ఎక్కువగా మరియు దుర్గంధంగా ఉండి , అది సాధారణ మలం యొక్క వాసనకు భిన్నంగా ఉన్నట్లయితే మీరు మీ బిడ్డను వెంటనే డాక్టర్కు చూపించండి.
మీ పిల్లలలో మల సమస్యల లక్షణాలు :
అదేవిధంగా మీ పిల్లలలో మల సమస్యలను సూచించే కొన్ని పాయింట్లు ఇక్కడ ఉన్నాయి.
1. ఈ క్రింది వాటిలో దేనినైనా గమనించినట్లయితే వెంటనే వైద్యుని సంప్రదించండి:
మలంలో రక్తం
జ్వరం
వాంతులు
ఆకలి లేకపోవడం
ముదురు రంగు మూత్రం
అలసట మరియు హుషారుగా లేకపోవడం
2. కొందరు పిల్లలు రోజుకి 4 నుండి 5 సార్లు వరకు మల విసర్జన చేయడం మరికొంతమంది పిల్లలు రెండు రోజులకు ఒకసారి మలవిసర్జన చేయడం చాలా సాధారణం. కానీ సగటు లో ఎక్కువ వైవిధ్యం ఉన్నట్లయితే అది ఇబ్బందిని సూచిస్తుంది.
3. ఒకవేళ మీ పిల్లలకు విరోచనాలు లాంటివి ఉన్నట్లయితే వారి క్రింది భాగాన్ని శుభ్రపరిచే విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం ఉంటుంది. ఎక్కువ సార్లు మల విసర్జన చేస్తూ మరియు శుభ్రపరుస్తూ ఉన్నందువల్ల ఆ శరీర భాగాలు సున్నితంగా మారి డైపర్ దద్దుర్లు రావడానికి అవకాశం ఉంది. మీరు డాక్టర్ దగ్గరకు వెళ్ళిన సమయంలో డైపర్ దద్దుర్లకు అవసరం అయిన క్రీములను పిస్క్రిప్షన్ లో రాసిమ్మని అడగండి.
4. చాలా మంది పిల్లలు మలవిసర్జన సమయంలో నొప్పితో కూడిన ముఖకవళికలను కలిగి ఉంటారు. ఎందుకంటే వారు ఆ సమయంలో ఒత్తిడిని కలిగి ఉంటారు. మీ బిడ్డ నిజమైన నొప్పితో బాధపడుతున్నట్లు మీరు అనుకుంటే తప్ప ఇది చాలా సాధారణం.
మీ శిశువు ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవడం, ఆందోళన చెందకుండా సమాచారాన్ని ఎంపిక చేసుకోవడం, మీ బిడ్డతో మంచి అనుబంధాన్ని పెంచుకోవడానికి మీ సమయాన్ని ఆదా చేస్తుంది. హ్యాపీ డైపర్ స్కానింగ్ !
Be the first to support
Be the first to share
Comment (0)
Related Blogs & Vlogs
No related events found.
Loading more...