సిజేరియన్ డెలివరీ తర్వాత అరటిపండును తినడం మంచిదా ? సిజేరియన్ డెలివరీ తర్వాత నివారించవలసిన ఆహారం ఏమిటో తెలుసా ?

ప్రసవం అన్నది ఒక అద్భుతమైన అనుభవం. అయితే మీకు సిజేరియన్ డెలివరీ అయితే మాత్రం మీరు దానికి మూల్యం చెల్లించవలసి ఉంటుంది . మామూలు ప్రసవం కంటే కూడా సిజేరియన్ డెలివరీ అయిన వారికి కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది .ఈ సమయంలో మీ శరీరానికి సరైన మరియు తగినంత పోషకాహారం అవసరం ఉంటుంది .అది మీకు మరియు మీ తల్లిపాలు తాగే బిడ్డకు కూడా చాలా అవసరం. సిజేరియన్ తర్వాత మీరు మీ ఆహారంలో చేర్చ గలిగిన పవిత్రమైన ఆహారాలలో అరటిపండు ఒకటి . ఈ పచ్చని సుందరి మీ శరీరం త్వరగా కోలుకోవడానికి సహాయపడే పోషకాల సమూహాన్ని కలిగి ఉంటుంది . చిన్నపిల్లలకి ఉపయోగపడే ఈ అరటి పండును ఎప్పుడు ,ఎలా ఇవ్వాలి అనే దానిపై మరింత చదవండి..
సి - సెక్షన్ తర్వాత అరటిపండు తినడం వలన కలిగే ప్రయోజనాలు :
మీరు కోలుకుంటున్న సమయంలో అతి ముఖ్యమైన ఖనిజమయిన పొటాషియమ్ పుష్కలంగా కలిగినది అరటిపండు .మరియు ఇది మీ శిశువు యొక్క సంపూర్ణమైన ఆరోగ్యానికి తోడ్పడుతుంది .పొటాషియం మీ ద్రవం మరియు ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. మరియు నరాల ప్రేరణను సహాయపడుతుంది. మీ కండరాలు సంకోచించడానికి సహాయపడుతుంది . మీ రక్తపోటును స్థిరంగా మరియు సాధారణంగా ఉంచుతుంది . మరియు ప్రోటీన్ , కొవ్వు, కార్బోహైడ్రేట్లు నుండి శక్తిని విడుదల చేయడానికి మీ శరీరానికి సహాయపడుతుంది.
అరటి పండులో ఉండే విటమిన్ ఏ , సి మరియు జింక్ లు శరీరం యొక్క అంతర్లీన కణజాలంను స్వస్థపరచడం లో కీలక పాత్ర పోషిస్తాయి . అదేవిధంగా మీ రోగనిరోధక శక్తిని పెంచి నొప్పిని మరియు గాయాలను కూడా నయం చేస్తుంది.
సిజేరియన్ డెలివరీ తర్వాత కొన్ని సార్లు మీరు మలబద్దకానికి లోనవుతారు. ఎందుకంటే మీ శరీరం తిరిగి ప్రేగుల కదలికలను ప్రారంభించడానికి కొంత సమయం పడుతుంది . కాబట్టి మీకు అరటిపండు ద్వారా తగినంత ఫైబర్ లభిస్తుంది . ఇది ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి సహాయపడుతుంది.
మెగ్నీషియం , పోలిట్ మరియు ఐరన్ లు సిజేరియన్ డెలివరీ అయిన తర్వాత మీ శరీరానికి ఎంతో అవసరం . ఇవి పొందడానికి అరటి పండ్లు తీసుకోవడం సరైన మార్గం.
సిజేరియన్ డెలివరీ అయిన తర్వాత అరటి పండు యొక్క ప్రాముఖ్యత :
సిజేరియన్ డెలివరీ అయిన తర్వాత అరటి పండ్లు తీసుకోవడం ఎంత ముఖ్యమో ఇప్పుడు మీకు తెలుసు . దీనిని మీ ఆహారంలో ఎలా చేర్చవచ్చు అనే దాని గురించి తెలుసుకునే కొన్ని మార్గాలు :
* దీనిని మీరు ఐస్ క్రీం లో గాని లేదా పెరుగుతో గాని కలిపి తీసుకున్నట్లయితే చాలా మంచిది.
* పాలు మరియు తేనెతో కలిపి అరటి పండును మిక్సీ వేసుకున్నట్లయితే మీరు రుచికరమైన మిల్క్షేక్ తయారవుతుంది.
* ఒక అరటి పండును మెత్తగా చేసి అందులో తేనె మరియు బెర్రీలు కలిపి తీసుకోవచ్చు.
* మీ ఓట్ మీల్ తో అరటిపండును చేర్చి తిని ఆనందించండి.
* ఓట్ మీల్ తో అరటిపండు కలిపి పాన్ కేక్ లాగా చేసుకోవడం అరటి పండును తీసుకునేందుకు మరో మార్గము.
సిజేరియన్ డెలివరీ తర్వాత తీసుకోకూడని ఆహారాలు ఏమిటి ?
మిమ్మల్ని మలబద్ధకానికి మరియు గ్యాస్ సమస్యలకు గురి చేసే సోడా , చిక్పా మరియు బంగాళదుంప , క్యాలీఫ్లవర్ వంటి కాయగూరలను తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే అవి మీ మలబద్ధకాన్ని పెంచుతాయి .
* కారం గా ఉండేది మరియు వేయించిన ఆహారం.
* చల్లని ఆహారం మరియు ఉడికించనివి.
* ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.
* మత్తు పదార్థాలన్నింటినీ పూర్తిగా మానేయాలి.
సిజేరియన్ డెలివరీ అయిన తర్వాత తీసుకోవాల్సిన ఇతర ఆహార పదార్థాలు :
పప్పులు :
వీటిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ కణాల పెరుగుదలకు సహాయపడుతుంది. ఇవి మీరు త్వరగా కోలుకునేందుకు సహాయపడతాయి.
విటమిన్ ఎ మరియు సి అధికంగా ఉండే పండ్లు మరియు కాయగూరలు.
ఓట్స్ మరియు రాగి :
ఇది పూర్తిగా మంచి మూలకాలతో నిండి ఉంటాయి . ఇవి ఫైబర్ ,కాల్షియం ,ప్రొటీన్, ఐరన్ మరియు కార్బోహైడ్రేట్ల యొక్క గొప్ప వనరులు.
ద్రవాలు :
సిజేరియన్ డెలివరీ అయిన తర్వాత మలబద్ధకం అనేది చాలా పెద్ద సమస్య . దీని నుండి బయట పడేందుకు ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవాలి . కొబ్బరి నీళ్ళు, సూపులు ,మూలికలతో తయారుచేసిన టీ, కొవ్వు తక్కువగా గల పాలు. ఇవన్నీ మీరు ఆస్వాదించగల కొన్ని రకాల ఆహారాలు.
గుర్తుంచుకోండి..బిడ్డ పుట్టిన తర్వాత కూడా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి .తల్లులు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలను బలంగా ఉంచగలరు.
ఈ బ్లాగు మీకు ఉపయోగకరంగా ఉందా ? దయచేసి దిగువ వ్యాఖ్యల విభాగంలో మీ మీ అభిప్రాయాలను మరియు సూచనలను మాతో పంచుకోండి. మీ నుండి వినడానికి మేము ఇష్టపడతాము.
Be the first to support
Be the first to share
Comment (0)
Related Blogs & Vlogs
No related events found.
Loading more...