9 నుండి 12 నెలల పిల్లలకు ఇవ్వవలసిన పండ్లు మరియు కూరగాయలు... మరియు ఇవ్వదగనివి.

మీరు 9 నుండి 12 నెలల బిడ్డకు తల్లిగా, మీరు మీ బిడ్డకు ఇవ్వవలసిన పండ్లు మరియు కూరగాయల ఎంపికలో కష్టపడుతున్నారా ? ఎప్పుడైనా మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటారా-నేను నా బిడ్డకు ఈ పండును ఇవ్వవచ్చా లేదా ఈ కాయగూరలను ఇవ్వవచ్చా? మీ సమాధానాలు అవును అయితే, ఈ బ్లాగ్ మీ కోసం ఉద్దేశించబడినది. మా పోషకాహార నిపుణులు పూజ శర్మ వశిష్ట గారు మీ 9 నెలలు అంత కంటే ఎక్కువ వయస్సు గల బిడ్డకు మీరు ఇవ్వగల పండ్లు మరియు కూరగాయలు జాబితాను ఇచ్చారు.
9-12 నెలల వయసు గల పిల్లలకు పండ్లు & కూరగాయలు.
సుమారు తొమ్మిది నెలల వయసులో పిల్లలు వేరువేరు ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభిస్తారు మరియు ఘన పదార్థాలు కూడా తీసుకోవడం మొదలుపెడతారు. ఈ దశలో మీరు మీ పిల్లలకు ఇవ్వగల కూరగాయలు మరియు పండ్ల జాబితా ఎక్కడ ఉంది...
మరింత సమాచారం...
1. పిండి కాయకూరలు మరియు పండ్లు :
బంగాళాదుంపలు, చిలగడదుంపలు, బీట్ రూట్ వంటివి బాగా ఉడకబెట్టి మెత్తగా చేయాలి. వీటిని అలాగే ఇవ్వవచ్చు లేదా క్యారెట్లు, గుమ్మడికాయ, పొట్లకాయ, బఠాణీలు లేదా బీన్స్ వంటి సులభంగా జీర్ణమయ్యే కూరగాయలతో కలిపి ఇవ్వవచ్చు . మీరు ఈ కూరగాయలతో సూప్ లేదా హల్వా కూడా చేసి ఇవ్వవచ్చు.
2. ముదురు ఆకుపచ్చ ఆకుకూరలు :
బాగా కడిగి శుద్ధిచేసి మరియు ఉడికించినవి. ఇనుము మరియు విటమిన్లు వీటిలో మంచిగా లభ్యమవుతాయి. విటమిన్ ఏ మరియు ఐరన్ సమృద్ధిగా గల పిండి పదార్థాలతో కూడిన కాయగూరలను ఈ సూప్ లో కలపవచ్చు. ఇవి శరీరానికి అవసరమైన రక్తంను, వ్యాధి నిరోధక శక్తిని మరియు మంచి కంటి చూపుకు ఉపయోగకరంగా ఉంటుంది.
3. సీజనల్ పండ్లు:
ఆపిల్, పీచ్, పియర్స్ లాంటి పండ్లను నీటిలో ఉడికించి పిల్లలకు ఇవ్వవచ్చు. అరటి ,మామిడి , సపోటా వంటి పండ్లను మెత్తగా చేసి మీ పిల్లలకు ఇవ్వవచ్చు. జ్యూస్ కోసం మీరు ఆపిల్, ద్రాక్ష , దానిమ్మ , పైనాపిల్ వంటి పండ్లను ఉపయోగించవచ్చు.
మీరు ఏ పండ్లను నివారించాలి ?
నారింజ , బత్తాయి వంటి పండ్లు అలెర్జీకి కారణం కావచ్చు. ఒక సంవత్సరం వయస్సు ఉన్న మీ పిల్లలకు శిశు వైద్యులను సంప్రదించిన తరువాత మాత్రమే వీటిని ప్రారంభించండి.
గుర్తుంచుకోవలసిన విషయం :
చిన్న పిల్లలకు ఏదైనా కొత్త ఆహారాన్ని ప్రారంభించేటప్పుడు మొదట తక్కువ మోతాదులో ఇవ్వాలి. ఇది ఏమైనా అలర్జీ లేదా అజీర్ణానికి కారణం అవుతుందా అని ఒక రోజు వేచి ఉండాలి. ఆ తర్వాత మీరు ఆహారాన్ని కొనసాగించవచ్చు.
పైన పేర్కొన్న ఈ ఆహార పదార్థాలలో దేనినైనా మీరు ప్రయత్నించారా ? మీ పిల్లలు ఎలా స్పందించారు ? దయచేసి క్రింది వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను మరియు సూచనలను మాతో పంచుకోండి. మీ అభిప్రాయాలు తెలుసుకోవడం మాకెంతో సంతోషం.
Be the first to support
Be the first to share
Comment (0)
Related Blogs & Vlogs
No related events found.
Loading more...