ఈ రుతుపవనాల సమయంలో డెంగ్యూ లక్షణాలు, చికిత్స మరియు మీ పిల్లల కొరకు నివారణ చిట్కాలు..

All age groups

Aparna Reddy

5.5M వీక్షణలు

5 years ago

ఈ రుతుపవనాల సమయంలో డెంగ్యూ లక్షణాలు, చికిత్స మరియు మీ పిల్లల కొరకు నివారణ చిట్కాలు..

ఋతుపవనాలు రావడం ప్రారంభం కావడంతో దోమల కారణంగా వచ్చే డెంగ్యూ భయం మొదలవుతుంది. దీనికి ప్రత్యేకమైన చికిత్స లేనందున ముందు జాగ్రత్త చర్యగా మన పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే మనం చేయగలం. వీటి వ్యాప్తి ని నియంత్రించడానికి ఆచరించదగిన కొన్ని నివారణ పద్ధతులు ఇక్కడ ఉన్నాయి. డెంగ్యూ నివారణ చర్యలకు వెళ్లక ముందు కొన్ని విషయాలను తెలుసుకుందాము...

Advertisement - Continue Reading Below

 

డెంగ్యూ అంటే ఏమిటి ?

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ( వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ) ప్రకారం డెంగ్యూ ను భారత దేశంతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో పెరుగుతున్న మహమ్మారి వైరల్ వ్యాధి గా నిర్వచించారు . ఆడదోమ అయిన

'ఈడిస్ ఈజిప్టై ' అనే  దోమ ద్వారా డెంగు వ్యాపిస్తుంది. ఇతర దోమల వ్యాధుల మాదిరిగా కాకుండా , పట్టణ ప్రాంతాల లోనూ మరియు పల్లె ప్రాంతాలలోను మరియు ఎంతో సంపన్నమైన ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల దేశాలలోనూ ఇది ప్రభావితం చేస్తుంది.

 

ఈడిస్ ఈజిప్టై అనే దోమ మురికి నీటిలో కంటే కూడా స్వచ్ఛమైన నీటి లోనే బాగా వృద్ధి చెందుతుంది.అందువలన ఇంటి పరిసర ప్రాంతాలలో నీటిని నిల్వ ఉంచకుండా చూడడం అన్నది చాలా ముఖ్యం.

 

పిల్లలలో డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు :

 

పిల్లలలో కూడా డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు ఇతరులకన్నా భిన్నంగా ఏమీ ఉండవు .ఈ డెంగ్యూ జ్వరం లక్షణాలు కూడా ఫ్లూ లక్షణాలలాగే తీవ్రతను కలిగి ఉంటాయి . ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన మీ చిన్నారులకు తీవ్రమైన జ్వరంతో పాటుగా ఈ క్రింది లక్షణాలు కనిపిస్తున్నట్లయితే ఆందోళన చెందవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది .అవి ఏమిటో చూద్దాం...

 

కంటి వెనుక భాగంలో నొప్పి :

 

మీ బిడ్డ తన కళ్ళు నొప్పిగా ఉన్నాయి అని చెప్పినప్పుడు  దీన్ని డెంగ్యూ సూచనగా గుర్తించి వారిని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్ళండి.

 

తీవ్రమైన తలనొప్పి :

 

మూడు సంవత్సరాల వయస్సు గల మీ చిన్నారి తనకు తలనొప్పిగా ఉంది అని మీకు తెలుపలేక పోవచ్చు .కానీ వారి తల, భుజాల నుండి  క్రింది వరకు ఎంతో బరువుగా ఉంటుంది.

 

దీనితో పాటుగా వాంతులు అవుతున్నట్లు అయితే అది మరీ ప్రమాద సూచన. ఎందుకంటే దీని కారణంగా శరీరంలోని నీటిని త్వరగా కోల్పోతారు . అలా అయినట్లయితే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.

 

వేడి దద్దుర్లు :

 

మీ పిల్లల శరీరం మీద అకస్మాత్తుగా పెద్దవిగా దద్దుర్లు కనిపించినట్లయితే దయచేసి వెంటనే చికిత్స కోసం డాక్టర్ ను సంప్రదించండి.

 

కండరాలు మరియు కీళ్ళ నొప్పులు :

 

మామూలు సమయంలో చురుగ్గా ఉండే చిన్నారులు అలసటగా నీరసంగా ఉంటారు. మరియు కీళ్ళ నొప్పుల గురించి ఫిర్యాదు చేస్తారు.

 

ఇలాంటివి మరెన్నో బ్లాగులు...

 

మీ పిల్లలను డెంగ్యూ నుండి ఎలా కాపాడాలి ? ఈ 6 డెంగ్యూ నివారణ చిట్కాలను తనిఖీ చేయండి.మరియు మీ చిన్నారి ని డెంగ్యూ జ్వరం నుండి కాపాడే 8 రకాల గృహవైద్యం పరీక్షించండి.

 

డెంగ్యూ జ్వరం వ్యాప్తి, అవగాహన, లక్షణాలు మరియు నివారణ చిట్కాలు :

Advertisement - Continue Reading Below

 

పిల్లలలో డెంగ్యూ జ్వరం ప్రమాదకరమా ?

 

తేలికపాటి డెంగ్యూ జ్వరం ప్రమాదకరం కానప్పటికీ,ముందుగా గుర్తించకుండా సరైన సమయంలో చికిత్స చేయక పోయినట్లయితే,  అది వారి ఆరోగ్యానికి ప్రమాదకరం అని రుజువు చేయబడింది. శ్వాసకోస సమస్యలు, విపరీతమైన వాంతులు,అలసట మరియు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడం లాంటి సమస్యలను కూడా కలిగిస్తుంది.

 

పిల్లలలో  డెంగ్యూ కి చికిత్స ఏమిటి ?

 

దురదృష్టవశాత్తు పిల్లలలో డెంగ్యూ కి ప్రత్యేకమైన చికిత్స లేదు.  మరియు ముందు జాగ్రత్త చర్యగా ఈ ఇన్ఫెక్షన్ నుండి దూరంగా ఉండటమే ఏకైక మార్గము. మీ పిల్లలకు కొబ్బరి నీరు, పండ్లరసాలు మరియు ఎక్కువ నీటితో కూడిన ద్రవపదార్థాలను ఎక్కువగా ఇవ్వండి. డెంగ్యు సంక్రమణ సమయంలో ఆస్ప్రిన్ లేదా బ్రు ఫిన్ వంటి మందులను ఇవ్వకండి. ఎందుకంటే వీటి వలన అంతర్గత రక్తస్రావం జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

 

పిల్లల్లో డెంగ్యూ ని ఎలా నివారించవచ్చు :

 

నీటిని నిల్వ ఉంచకండి :

 

కూలర్ ప్యాడ్స్ ను మరియు పూల కుండీలను క్రమం తప్పకుండా శుభ్రపరచండి. కృత్రిమమైన వస్తువులను, విరిగిపోయిన కప్పులను, ఫ్లాస్కులనూ ఇంట్లో నిల్వ చేయకండి. నీటితో నింపిన బకెట్ లను  మూసి ఉంచండి.  పక్షులకు ప్రతి రోజు శుభ్రంగా స్నానం చేయించండి.

 

ఇంట్లో పెంచే మొక్కలను వెలుపల ఉంచండి :

 

అవును, మనం అందరం ఆకుకూరలను ఇంట్లోనే తాజాగా పెంచుకుంటాము. కానీ వర్షాకాలంలో వేపా మరియు తులసి మినహాయించి మిగతా మొక్కలు అన్నింటిని బయటే ఉంచండి. మొక్కలకు తగినంత నీటిని మాత్రమే పోయండి. కుండీలను శుభ్రంగా ఉంచుకోండి .వీటితో పాటుగా ఈ అదనపు జాగ్రత్తలు తీసుకోండి.

 

దోమల నివారిణులు ముఖ్యమైనవి :

 

మినిమం 10 శాతం 'డిఈఈటి' తో ఉన్న దోమల వికర్షకం లను వాడండి. మీరు మీ చిన్నారుల కోసం స్ప్రేలు లేదా బ్యాండ్ లను కూడా ఉపయోగించవచ్చు.

 

మంచిగా బట్టలతో కప్పి ఉంచండి :

 

పగటి వేళల్లో ఈ డెంగ్యూ దోమలు ఎక్కువగా ఉంటాయి .అందుకే పిల్లలను పగటి వేళల్లో బాగా కప్పి ఉంచండి. మీ చిన్నారులకు ఫుల్ గా ఉండే ప్యాంట్లు, సాక్సులు ,పొడవు చేతులు టీ షర్ట్ లు మరియు టాప్స్ ను ఉపయోగించండి.

 

ఇంటి లోపల శుభ్రంగా మరియు పొడిగా ఉంచండి :

 

ఇంటిలో మూలల లో గానీ, పై భాగంలో గాని ఎక్కడ గుంటలు లేకుండా చూసుకోండి. ఆ ప్రాంతాలలో తడిలేకుండా పొడిగా ఉంచండి. చెత్త బుట్టలను ఎప్పుడూ మూసి ఉంచండి. మరియు చెత్తను తరచుగా తీసివేస్తూ ఉండండి. దోమల నివారణ కోసం మీరు కర్పూరంను ఇంటిలో మండించవచ్చు.  లేదా యూకలిప్టస్ ఆయిల్ మరియు లెమన్ గ్రాస్ ఆయిల్ కూడా ఉపయోగించి మీ ఇంటిలోనికి దోమలు రాకుండా చేసుకోవచ్చు.

 

విషయాలను ప్రాక్టీస్ చేయండి :

 

మంచిగా కర్టన్ తో కవర్ చేసిన ఎయిర్ కండిషన్ గదులలోనేి ఉండండి.  సరైన రక్షణ లేకుండా పగటి పూట బయటకు వెళ్ళకండి. సువాసనగల పరిమళ ద్రవ్యాలను లేదా సబ్బులను నివారించండి .ఇవి దోమలను ఆకర్షిస్తాయి.

 

మంచి అవగాహన మరియు భద్రతా చర్యలతో దోమల ద్వారా వచ్చే అనారోగ్యాలను సులభంగా నివారించవచ్చు అని గుర్తుంచుకోండి. కాబట్టి రుతుపవనాలలో ఆరోగ్యంగా ఉండటానికి మరియు వర్షాలను ఆస్వాదించడానికి సిద్ధపడుదాం.. మీ పిల్లలను డెంగ్యూ జ్వరం నుండి ఎలా కాపాడాలో చదవండి.

 

ఈ బ్లాగు మీకు నచ్చిందా? డెంగ్యూ నివారణకు మీవద్ద మరిన్ని గృహ వైద్యాలు ఉన్నాయా?  దయచేసి దిగువ వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను మరియు ఆలోచనలను మాతో పంచుకోండి. మీ అభిప్రాయాలను తెలుసుకోవడం మాకెంతో సంతోషం.

 

Be the first to support

Be the first to share

support-icon
Support
share-icon
Share

Comment (0)

share-icon

Related Blogs & Vlogs

No related events found.

Loading more...