ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై సానుకూల ప్రభావాన్ని ఎలా చూపగలరు.

1 to 3 years

Aparna Reddy

4.6M వీక్షణలు

5 years ago

 ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై సానుకూల ప్రభావాన్ని ఎలా చూపగలరు.

శ్వేత ప్రసూతి విరామం ముగియనుంది. మరియు ఆరు నెలల వయస్సున్న తన చిన్నారి అన్య గురించి ఆమె చింతించకుండా ఉండలేక పోతుంది. ఆమె మరియు ఆమె భాగస్వామి కలిసి ఒక మంచి డేకేర్ సదుపాయం పై ఎంతో పరిశోధన చేసి చివరికి కనుగొనలేకపోయారు. మరియు స్వేత తల్లిదండ్రులు వారికి దగ్గరలోనే నివసిస్తూ ఉంటారు. వారు అవసరం అయినప్పుడు అన్యను జాగ్రత్తగా చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అపరాధభావం ఆమెను కలచి వేయసాగింది. ఆమె బిడ్డతో ఉన్న అనుబంధాన్ని మరియు బిడ్డతో గడిపే సమయాన్ని వదిలి తిరిగి ఉద్యోగానికి వెళ్లడానికి సిద్ధ పడలేకపోతుంది.

Advertisement - Continue Reading Below

 

అన్ని రకాల ఉద్యోగాలలో మహిళల సంఖ్య పెరుగుతున్న అందువలన, ఈ పరిస్థితి చాలా సాధారణం. బిడ్డ పుట్టిన తర్వాత ఉద్యోగానికి ఎప్పుడు తిరిగి రావాలో అనేదాని గురించి ప్రతి తల్లి మనస్సులోనూ జరిగే అంతర్గత యుద్ధము ఎంతో ఒత్తిడిని కలిగిస్తుంది. మీరు కూడా ఈ పరిస్థితిలో ఉన్నట్లయితే, లేదా ఇప్పుడు దాని గుండా వెళ్ళుతున్నట్లు అయితే, మీరు ఉద్యోగం చేసే తల్లి కావడం వలన మీ బిడ్డ ఎలా ప్రయోజనం పొందుతాడో తెలుసుకోవడానికి దీన్ని చదవండి.

 

తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగం చేయడం వలన పిల్లలకు కలిగే ప్రయోజనం విధంగా ఉంటుంది.

 

ఈ విషయంపై అనేక అధ్యయనాలు జరిగాయి. ఎక్కువ శాతం ఫలితాలు, తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం పిల్లలపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని తెలుపుతున్నాయి. ఇక్కడ ఏ విధంగా ఉందంటే..

 

స్వాతంత్రము :

మీ బిడ్డ డే కేర్ లో ఉన్న , లేదా అమ్మమ్మ తాతయ్యలు చూసుకుంటున్నా, వారిలో స్వతంత్ర భావం వేగంగా అభివృద్ధి చెందుతుంది. పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మరియు తల్లిదండ్రులపై ఆధారపడకుండా వారి పనులు వారే చేసుకోవడం మీరు గమనిస్తారు.

 

నిత్యకృత్యాలు :

మీ బిడ్డలు చిన్నప్పటి నుంచి ఒక దినచర్యకు అలవాటు పడతారు. మీరు సాయంత్రం 6 గంటలకు తిరిగి వస్తారని వారికి తెలుసు. మరియు మీ కోసం తలుపు వైపు చూడటం ప్రారంభిస్తారు. వీకెండ్స్ అంటే కుటుంబ సంతోషాలు అని పిల్లలు ఆ క్రమానికి అలవాటు పడతారు.

 

ఇతరుల నుండి ప్రేమ :

మీ పిల్లలకు ప్రేమగల పెద్దల ప్రభావము మరియు సంరక్షణ కూడా అవసరం. వారి ప్రేమలో మునిగి పోవడమే కాకుండా, మీరు దూరంగా ఉన్నప్పుడు అతన్ని చూసుకునే బామ్మ తాతయ్యలు లేదా ఇతర దగ్గర బంధువులు చుట్టూ ఉండడం వలన అతనికి సామాజిక నైపుణ్యాలు కూడా అలవడుతాయి. మరొక ఇతర ప్రయోజనం ఏమిటంటే, వేర్వేరు వ్యక్తులతో వేర్వేరు భాషల్లో సంభాషించేటప్పుడు వారి భాషా నైపుణ్యాలు మెరుగుపడతాయి.

 

పాతకాలపు అలవాట్ల నుండి బయటకు వస్తారు :

పూర్వకాలంలో ఆడవారి పనులు మగవారి పనులు వేరువేరుగా నిర్ధారించబడి ఉండేవి. ఇప్పుడు ఆ విధానాలు మారిపోయాయి. ఈ రోజుల్లో ఎంతోమంది తల్లులు ఉద్యోగాలను ఎంచుకోవచ్చు లేదా కొందరు ఇంట్లో కూడా ఉండవచ్చు. ఇది స్త్రీ-పురుష బేదాలకు తావులేకుండా  పిల్లలు దానిని జీవన విధానంగా భావిస్తారు.

 

మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు మీ బిడ్డ సౌకర్యంగా ఉన్నాడు అని నిర్ధారించుకోవడానికి చిట్కాలు :

 

ఏది ఏమైనా, ఒక చిన్న బిడ్డను విడిచిపెట్టి ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి పడుతున్న అపరాధ భావన నుండి బయటపడడం చాలా కష్టం. మీ మనస్సుకు ప్రశాంతతనిచ్చే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి :

Advertisement - Continue Reading Below

 

నమ్మదగిన వాతావరణాన్ని కలిగి ఉండడం :

 

మీ చిన్న బిడ్డను చూసుకోవడానికి మీ ఇంటికి దగ్గరలో మీ కుటుంబ సభ్యులు ఉన్నట్లయితే మీరు ఎంతో అదృష్టవంతులు. అటువంటి వారికి ఎటువంటి సమస్య లేదు. కానీ అది ఎల్లప్పుడు సాధ్యం కాదు. కాబట్టి మీరు మీ మద్దతు వ్యవస్థ జాగ్రత్తగా ఎంచుకోవాలి. అది డే కేర్ సౌకర్యం లేదా నాని అయినా సరే బాగా పరిశోధన చేసి, స్నేహితుల దగ్గర సూచనలు కూడా తీసుకొని నిర్ధారించుకోండి.

 

స్కూల్లో వదలడం మరియు తీసుకురావడం :

మీ భాగస్వామితో కలిసి ప్రతిరోజు ఉదయం,  సాయంత్రం పిల్లలను విడిచి మరియు తీసుకురావడానికి స్కూల్ కి వెళ్లడం అలవాటు చేసుకోండి. బిజీగా మీ రోజు ప్రారంభమయ్యే ముందు స్కూల్లో వారిని వదలడం అంటే ఉదయంపూట వారితో అదనంగా మరో 20 నిముషాలు గడపడానికి అవకాశం ఉంటుంది.

 

ప్రతి రోజు ఒక పూట కలిసి భోజనం చేయండి :

భోజనం చేసే సమయం అన్నది మనకు దొరికే మంచి అవకాశము. కుటుంబమంతా కలిసి  ఒక పూట భోజనం చేసే లాగా ప్రణాళిక వేసుకోండి. భోజన సమయం కేవలం తినడానికి మాత్రమే కాదు. ప్రశాంతంగా మాట్లాడుకుంటూ అనుబంధాన్ని పెంచుకోవటం లాంటిది. మీ ఫోన్లకు దూరంగా ఉండి చక్కగా కబుర్లు చెప్పండి.

 

నిద్రించే సమయం :

పిల్లలు నిద్రించడానికి ముందు గడిపే సమయం వారి ఆరోగ్యకరమైన నిద్రకు ఎంతో ముఖ్యమైనది. మీరు వారిని గట్టిగా కౌగిలించుకునేటప్పుడు, ఓదార్పు నిండిన గొంతుతో వారి మాటలను  100% పూర్తి  శ్రద్ధతో వినేటప్పుడు వారు చాలా సంతోష పడతారు. మంచిగా నిద్రపోగలుగుతారు. ఆ సమయంలో మీ మొబైల్ ఫోను ఆఫ్ చేయండి లేదా మరొక గదిలో ఉంచండి.

 

మీకు ఇంటికి వచ్చేందుకు ఆలస్యం అవుతుంటే ఫోన్లో మాట్లాడండి :

అలా పిల్లలతో ఫోన్లో మాట్లాడినట్లు అయితే , మీరు త్వరగా ఇంటికి చేరుకుంటారని భరోసా కలిగి ఉంటారు. మరియు  మీరు వారి గురించి ఆలోచిస్తూ ఉంటారని ధైర్యంగా ఉంటారు. మీ పిల్లల మానసిక అభివృద్ధికి ఈ భద్రతా భావం ఎంతో అవసరం.

 

మీ ఉద్యోగ విషయాలను ఇంటికి తీసుకు వెళ్ళకండి :

అవును, ఇలా చెప్పడం చాలా సులభం కానీ ఆచరణ కష్టం. అయినప్పటికీ, ఇంట్లో మీరు ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది మీ పిల్లలకు నిరాశ కలిగించి తప్పుదారి పట్టించడానికి దారితీస్తుంది. మీ చిన్నారి మేల్కొని ఉన్నప్పుడు మీ లాప్టాప్ కు దూరంగా ఉండండి. మరీ అవసరమైతే ఆమె నిద్ర పోయిన తర్వాత ఆ  ఈ మెయిల్స్ ను పంపండి.

 

వీకెండ్ సంతోషం :

వీకెండ్ లో మీ పిల్లల కోసం మంచిగా, సంతోషంగా  సమయాన్ని వెచ్చించండి. మాల్స్, సూపర్ మార్కెట్, టెంపుల్ లేదా కొంచెం దూరంలో ఉండే పార్కులకు వెళ్ళండి.

 

ప్రతిరోజు కొద్ది సమయం బయటకు వెళ్ళండి :

మీ చిన్నారి పాఠశాల లేదా ప్లే స్కూల్ కు వెళ్ళడం మొదలు పెట్టకపోతే, వారిని రోజు కొంత సమయం బయటకు తీసుకెళ్లడం ఎంతో అవసరం. ఇది దగ్గరలో ఉన్న పార్క్ లేదా కిరానా షాపు ఏదైనా కావచ్చు. కానీ, వారికి కొంత మార్పు అవసరం. మీరు ఆఫీస్సు నుండి తిరిగి వచ్చిన తర్వాత దీన్ని చేయాలని నిర్ధారించుకోండి.


ఎక్కువ సమయం గడపడం కంటే సంతోషంగా సమయాన్ని గడపడం ఎంతో అవసరం. ప్రతిరోజు ఉదయాన్నే బిడ్డను విడిచి ఆఫీస్ కి వెళుతున్న ప్రతిసారి అపరాధ భావాన్ని తెచ్చుకోకండి. మీ దినచర్యను సర్దుబాటు చేయడానికి ఈ చిట్కాలను ప్రయత్నించండి. మరియు మీ బిడ్డ సంతోషకరమైన బిడ్డ అవుతాడు ! మీ చిన్నారి తో గడిపేసమయాన్ని మరియు మీ ఉద్యోగాన్ని సమతుల్యంగా ఎలా కొనసాగిస్తారు ? వ్యాఖ్యల విభాగంలో మీ చిట్కాలను మాతో పంచుకోండి !

Be the first to support

Be the first to share

support-icon
Support
share-icon
Share

Comment (0)

share-icon

Related Blogs & Vlogs

No related events found.

Loading more...