మహమ్మారి సమయంలో పిల్లల పెంపకం - మారుతున్న కార్యాచరణ

గ్లోబల్ ఎమర్జెన్సీలో, ఇటువంటి పరిస్థితులను మనలో ఇంతకుముందు ఎవరూ ఎదుర్కొనవలసి రాలేదు. ఉద్యోగాలు పోవడం, స్కూలు మూతపడటం కుటుంబ పరిస్థితులు మారిపోవడంతో ప్రతి ఒక్కరిలోనూ ఒక రకమైన ఆందోళన ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రత్యేకమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ మహమ్మారి కారణంగా 7 నెలల నుండి తల్లిదండ్రులు ప్రతిరోజు ఎన్నో రకాల పాత్రలను పోషించడంలో సవాలును ఎదుర్కొంటున్నారు. ఇంటి నుండి పని చేయాల్సి రావడం, ఎక్కువ మద్దతు లేకుండా కుటుంబాన్ని నడపడం, పిల్లలను ఆన్లైన్ క్లాసులకు తయారుచేయడం, సామాజిక దూరం, ఆర్థిక ఒత్తిడి మరియు కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల నుండి ఎటువంటి సపోర్ట్ లేకపోవడం మరొక సమస్యగా మారింది.
భయం, అనిశ్ఛితి, కుటుంబ సభ్యులు అందరిలోనూ ఒకే రకమైన భయం. విహార యాత్రలు లేవు మరియు వినోదాలపై పరిమితి కుటుంబంలో మరెన్నో రకలా కొత్త సర్దుబాట్లు ఎంతో కష్టతరం చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులలో మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా కఠినమైన పనిగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల నుండి బయట పడడానికి ఒక ఖచ్చితమైన ప్రణాళిక చేయగలిగినట్లయితే, పిల్లలు సురక్షితంగా ఉండటానికి, ఆరోగ్యకరమైన దినచర్యను నిర్వహించడానికి, వారి భావోద్వేగాలు మరియు వారి ప్రవర్తనపై నిఘా ఉంచడం మరియు వారి స్థితిస్థాపకతను పెంపొందించడానికి తల్లిదండ్రుల సహాయం ఎంతో ముఖ్యం.
కొన్ని పరిస్థితులను సులభంగా తీసుకోవడం, ఉన్నత ప్రమాణాలకోసం ఎదురు చూడకుండా ఉండటం వంటి కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా సమతుల్యతను సాధించవచ్చు. ఇది కేవలం తల్లిదండ్రులకు మాత్రమే కాదు కుటుంబం అంతటికీ కూడా ఇటువంటి భయంకర పరిస్థితులను ఎదుర్కోవడం సులభతరం చేస్తుంది.
ఈ మహామారి సమయంలో పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు సులువుగా అవలంబించదగిన కొన్ని చిట్కాలు :
పిల్లలు మనలను చూస్తూ, మన నుండి ముఖ్యమైన జీవిత పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు మన భావాలను ప్రదర్శించే సమయంలో వారికి మాదిరిగా ఉండండి. మీరు ఆందోళన చెందుతున్నప్పుడు, మీ భావోద్వేగాలను దాచడానికి బదులుగా మాటల్లో ఉంచడానికి ప్రయత్నించండి. తల్లిదండ్రులు కూడా ఈ పరిస్థితులు మన చేతిలో లేనప్పుడు కొన్ని పరిస్థితులలో ఆందోళనకు మరియు నిరాశకు గురికావడం సర్వసాధారణం. ఈ మహమ్మారి సమయంలో సంభవించే అనేక రకాల సమస్యలను నుండి బయటపడడానికి ప్రయత్నించండి. మీరు నియంత్రించగల వాటిని మరియు నియంత్రించజాలని వాటిని ఒక జాబితాలా తయారు చేసుకోండి. మీరు ఆందోళన చెందుతున్న లేదా ఆత్రుతగా ఉన్నప్పుడు మీరు నియంత్రించగల విషయాలపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. మన చేతుల్లో లేని విషయాలను మరియు మనం నియంత్రించలేని విషయాలను అంగీకరించడానికి సాధన చేయండి.
ఈ క్లిష్ట పరిస్థితులలో మనం కోల్పోతున్న వాటి గురించి ఫిర్యాదు చేయకుండా ఒక కొత్త జీవన విధానాన్ని ప్రారంభించండి. ఇటువంటి సంక్షోభ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో మన పిల్లలు మన నుండి ముఖ్యమైన పాఠం నేర్చుకుంటారు. కాబట్టి మనం కోల్పోయిన వాటిపై దృష్టి పెట్టడం, అంటే కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో విధులకు వెళ్ళటం, సినిమాలు చూడడం, సిటీ అంతా చుట్టి చూడడం, లైవ్ మ్యూజిక్ కచ్చేరీలు, ఇష్టమైన రెస్టారెంట్లో భోజనం చేయడం లాంటి కరోనా ముందు రోజులను గుర్తు చేసుకోవడం కష్టతరంగా ఉంటుంది. దానికి బదులుగా డైటింగ్, వ్యాయామము, ఆరోగ్యంపై ఎక్కువ దృష్టిపెట్టడం వంటి వాటిని కొనసాగించాలి అని ప్రణాళికను సిద్ధం చేసుకోండి. కుటుంబ సభ్యులందరూ కలిసి మంచిగా సమయాన్ని గడపడం వలన పిల్లల రోజువారీ జీవితంలో సానుకూల విషయాలపై అవగాహన పెంచుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి మరియు వారి ఆలోచనా విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది.
రాబోవు దినాలలో మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అవలంబించడానికి ఇది ఒక అవకాశంగా పరిగణించండి. మీరు చాలా కాలంగా చేయాలి అనుకుంటూ చేయలేని పనుల జాబితాను తయారు చేసుకోండి. చక్కటి వ్యాయామం, సరైన నిద్ర ,చాలాకాలం నుండి చిందరవందరగా ఉన్న వార్డ్ రోబ్లను సర్దుకోవడం లాంటి ఎన్నో రోజులుగా చేయాలి చేయాలి అనుకుంటూ ఉన్న పనులను పూర్తి చేయండి.
వారి సొంత పనులతోపాటుగా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఇంటి పనులను మరియు పిల్లల బాధ్యతలను పంచుకోవడం ద్వారా ఈ మహమ్మారి ప్రభావం కొంత సులభతరమౌతుంది. శుభవార్త ఏమిటంటే, తండ్రులు కూడా పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ వహిస్తున్నారు. అనేక నివేదికల ప్రకారం మహమ్మారి కారణంగా మునుపెన్నడూ లేని విధంగా కుటుంబాలలో స్త్రీలు చేసే మల్టీటాస్కింగ్ ను చూసి పురుషులు అభినందిస్తున్నారు.
ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు అంగీకరించడం నేర్చుకుంటున్నారు. చాలా సందర్భాలలో తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి సహకరించుకుంటూ ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ఈ సమయంలో ఆగ్రహం వ్యక్తం చేయకుండా ఇరువురూ కలిసివారి అనుబంధాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అయితే ఒకరి బలహీనతలను ఒకరు అర్థం చేసుకొని ఇతరుల బలహీనతలను స్వీకరించవచ్చు. ఇది మన పిల్లలకు కూడా ఒక మంచి గుణపాఠం లాగా ఉంటుంది. వారు ఇతరుల భావాలకు ఏవిధంగా విలువను ఇవ్వాలో నేర్చుకుంటారు.
మీ పిల్లలను ఎక్కడ విభేదించాలో గమనించండి. ఈ మహమ్మారి వచ్చి 7 నెలలు దాటిపోవడంతో దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో మీకే అర్థం అయి ఉంటుంది. పిల్లలను ఉదయాన్నే నిద్రలేవడం, స్నానం చేయడం లేదా సరైన సమయానికి భోజనం చేయడం లాంటి దైనందిక విషయాలలో మీరు ఒత్తిడి చేసినట్లయితే వారు మీమాటలను లెక్క చేయకపోగా మీతో వాదనలకు సిద్ధపడతారు. ముఖ్యంగా వీకెండ్స్ లో వీటిని పట్టించుకోవడం మానేయండి. పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళండి. దీనికి అర్థం పిల్లలు ఎప్పుడు హాలిడే మూడ్ లోనే ఉండి దినచర్యను అనుసరించకూడదు అని కాదు. కాబట్టి ఏది ఆమోదయోగ్యమైనది మరియు ఏది కాదు అనే విషయాలపై కొన్ని నియమాలను విధించే సమయంలో స్పష్టంగా మరియు నిర్దిష్టంగా ఉండండి.
మనం ఒక మాదిరిగా ఉండి వారిని నడిపించడానికి ఇది ఒక ముఖ్యమైన సమయం. ఒక సంక్షోభ సమయాన్ని ఎలా ఎదుర్కోవాలో మీ పిల్లలకి మీ ప్రవర్తన ద్వారా చూపించండి. కోవిడ్ -19 కారణంగా మన జీవితాలు అనివార్యంగా ఉంటాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో నూతనమైన దైనందిక కార్యక్రమాలు, మన కొత్త దినచర్యలు, తల్లిదండ్రులుగా మన పాత్రలు, మారుతున్న మన కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా మన జీవితాలను సంతోషంగా మలచుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితులలో మన జీవితాలలో సంతోషాలను కొత్త మార్గాలలో వెతుక్కోవడానికి ప్రయత్నించాలి.
Be the first to support
Be the first to share
Comment (0)
Related Blogs & Vlogs
No related events found.
Loading more...