ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ ఈవ్ సం ప్రదాయాలు

ఇది సంవత్సరంలో అత్యంత అద్భుతమైన సమయం, ఇక కొన్ని వారాలపాటు శీతాకాలం హాయిగా ఉంటుంది, ప్రజలు ఉల్లాసంగా కనిపిస్తారు మరియు ప్రతి చోట ఒక చల్లని మధురమైన వాతావరణం ఉంటుంది. ఇది క్రిస్మస్ సమయం. ఇది సంవత్సరంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం. బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం, క్రిస్మస్ కోరల్స్ పాడడం, రకరకాల కుకీస్ మరియు ఇతర సాంప్రదాయ వంటకాలలో మునిగిపోయే సమయం.
ఈ ఆనందాల పండుగను జరుపుకునే ప్రతి ఒక్కరూ తమ సొంత క్రిస్మస్ సాంప్రదాయాలను అనుసరిస్తారు. క్రిస్మస్ పండుగను ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలుగా జరుపుకుంటారని మీకు తెలుసా ? వాటి గురించి తెలుసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు ఆశ్చర్య పరుచుకోవాలి అనుకుంటున్నారా ? క్రిస్మస్ ఈవ్ సంప్రదాయాలను అనుసరించడానికి వారి వారి ప్రత్యేకతలు కలిగి ఉన్న కొన్ని దేశాల సమాచారాన్ని నేను మీకు అందిస్తున్నాను.
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ ఈవ్ సంప్రదాయాలు :
జెయింట్ లాంతర్ ఫెస్టివల్ , ఫిలిప్పీన్స్ :
దీనిని ' క్రిస్మస్ రాజధాని నగరం ' అని కూడా పిలుస్తారు. ఈ పండుగను శాన్ ఫెర్నాండో లో అత్యంత వైభవంగా జరుపుకుంటారు మరియు ప్రపంచ నలుమూలలో ఉన్న ప్రజలను ఇది ఆకర్షిస్తోంది. ఈ పండుగలో 11 గ్రామాలు పాల్గొంటాయి. ఉత్తమ లాంతర్ ను తయారు చేయడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఇది పోటీ అనిపిస్తుంది కానీ స్థానికులు అందరూ కలిసి మెలిసి ఎంతో సంతోషంగా గడుపుతారు.
యులే లార్డ్స్, ఐస్లాండ్ :
ఐస్లాండ్ లో క్రిస్మస్ పండుగను 13 రోజుల ముందునుండే జరుపుకుంటారు. పిల్లలకు ఇచ్చే బహుమతులను ప్రత్యేకమైన విధానంలో తయారు చేస్తారు. సాక్స్ మాత్రమే కాదు బూట్లు కూడా. యులేలాండ్ ప్రజలు బహుముఖ భూతం పాత్రలు ధరించి 13 రాత్రులు వరుసగా నగరంలో తిరుగుతూ క్రిస్మస్ వరకు దీనిని జరుపుకుంటారు. పిల్లలు తమ ఉత్తమ బూట్లను కిటికీలో ఉంచడం జరుగుతుంది. మంచిగా తయారుచేసిన అమ్మాయిలకు మరియు అబ్బాయిలకు బహుమతులను ఆ బూట్లలో ఉంచుతారు. కొందరు అల్లరి పిల్లలు ఆ బూట్లలో బంగాళదుంపలను బహుమతిగా ఉంచుతారు. మీరు ఈ కథను మీ పిల్లలకు చెప్పవచ్చు. మంచి ప్రవర్తనను అలవరచుకోవడానికి ఇది ప్రేరేపిస్తుంది. వారు నిజంగా తమ సాక్స్ లో బంగాళదుంపలను క్రిస్మస్ ఈవ్ సందర్భంగా నిజంగా కోరుకుంటే తప్ప.
సెయింట్ నికోలస్ డే, జర్మనీ :
సెయింట్ నికోలస్ పట్టణమంతా పర్యటించి చిన్నపిల్లలకు అద్భుతమైన బహుమతులను ఇస్తాడు, దానికి బదులుగా వారు ఒక కవితను చెబుతారు. చిన్నపిల్లలను వీనులవిందుగా ఉండే ఇటువంటి పనుల కోసం ప్రేరేపించడం ఎంత గొప్ప మార్గం. అతను ప్రతి సంవత్సరం డిసెంబర్ ఆరో తేదీన అర్ధరాత్రి ఒక గాడిదపై ప్రయాణించి పిల్లలకు నారింజలు, క్యాండీస్, నాణాలు మరియు బొమ్మలను వదిలి వెళతాడు.
నార్వే :
నార్వేలో క్రిస్మస్ ఈవ్ సాంప్రదాయాన్ని ఒక ప్రత్యేకమైన విధానంలో మరియు సనాతన మార్గంలో జరుపుకుంటారు. ఇక్కడ ప్రజలు తమ చీపురులను రహస్య ప్రదేశంలో, ఎవరికీ కనబడకుండా ఇంటి మూలలో దాస్తారు. సాంప్రదాయం వారి చీపురు కర్రను మంత్రగత్తెలు మరియు దుష్ట శక్తుల నుండి కాపాడాలనే ఆలోచనతో చేయబడింది. మీరు స్వారీ చేయడానికి చీపురు పుల్లలను వెతుక్కుంటూ బయటకు వస్తారు.
లైటింగ్ ఆఫ్ నేషనల్ హనుక్క మనోర, వాషింగ్టన్ డి.సి - యూఎస్ :
క్రిస్మస్ మరియు హానుక్క ఒకే సమయంలో వస్తాయి. అది కూడా యునైటెడ్ స్టేట్స్ అంతా కూడా అతి ప్రసిద్ధ పండుగ. 1979 నుండి హనుక్కా యొక్క ఎనిమిది రోజులు రాత్రి పగలు వైట్‌హౌస్ ప్రాంగణంలో 9 మీటర్ల భారీ మెనూరాను ఉంచుతారు. వాషింగ్టన్ డి.సి లో సంగీత కచేరీలు, ప్రసంగాలు, పిల్లలకోసం ప్రత్యేక కార్యక్రమాలు మరియు మనోరా యొక్క లైటింగ్ లతో మంత్రముగ్దులను చేస్తుంది.
వెనిజులా :
క్రిస్మస్ ఈవ్ సందర్భంగా వెనిజులాలో ప్రజలు ప్రతి క్రిస్మస్ పండుగ సందర్భంగా ఉదయాన్నే చర్చి సందర్శించడానికి ఇష్టపడతారు. ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ చర్చిని సందర్శించే సమయంలో దీని యొక్క ప్రత్యేకత ఏమిటో ఆలోచించాలి. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి ! వెనిజులా ప్రజలు ఆ సమయంలో రోలర్ బ్లేడ్ లను ఉపయోగిస్తారు. వారి భద్రత కారణాల దృష్ట్యా ప్రభుత్వం ఆ నిర్దిష్ట సమయంలో కార్లపై నిషేధం విధిస్తుంది. ఈ సాంప్రదాయం వెనుక తర్కించ దగిన విషయం ఏమీ లేదు. కానీ వారి మతపరమైన సందర్శన ముగిసిన తర్వాత, వారు సాంప్రదాయక క్రిస్మస్ భోజనం కోసం ఇంటికి తిరిగి వెళతారు.
డే ఆఫ్ ద లిటిల్ క్యాండిల్స్, కొలంబియా :
క్రిస్మస్ సీజన్ ప్రారంభంలో కొలంబియాలో లిటిల్ క్యాండిల్స్ రోజును వర్జిన్ మేరీ మరియు ఇమ్మక్కులేట్ కాన్సెప్షన్ గౌరవార్దం గా జరుపుకుంటారు. ఇక్కడి ప్రజలు తమ కిటికీలు మరియు బాల్కనీలపై కాగితపు లాంతర్లు మరియు కొవ్వొత్తులను ఉంచుతారు.
కావల్కెడ్స్ ఆఫ్ లైట్స్ ,టొరంటో :
ఈ సాంప్రదాయంతో టొరంటోలో సెలవు దినం ప్రారంభమవుతుంది. స్క్వేర్ మరియు క్రిస్మస్ ట్రీ 300,000 కంటే ఎక్కువ సామర్ధ్యం గల ఎల్ఈడి లైట్లతో ప్రకాశిస్తాయి. ఇవి సంధ్యా సమయం నుండి 11:00 వరకు నూతన సంవత్సరం వరకు ఉంటాయి. మరియు బాణసంచా కూడా కాలుస్తారు.
క్రిస్మస్ ఈవ్ సాంప్రదాయాలు మీరు మీ కుటుంబంతో ప్రారంభించవచ్చు :
ప్రపంచవ్యాప్తంగా వివిధ సాంప్రదాయాలతో క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నందున, మీరు కూడా మీ ప్రియమైన వారితో ఏదైనా ప్రత్యేకమైన విధానంతో ప్రారంభించవచ్చు. మీ ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉన్నట్లయితే ఆ పసి బిడ్డ కోసం కొన్ని క్రిస్మస్ ఈవ్ ఆలోచనలను మీరు కోరుకుంటున్నట్లైతే, మీ పిల్లలకు ఉత్తమమైన మరియు చిరస్మరణీయమైన మొదటి క్రిస్మస్ ఈవ్ జరుపుకోవాలని నిర్ధారించుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. పిల్లల కోసం క్రిస్మస్ ఈవ్ సాంప్రదాయాలు ఇక్కడ ఉన్నాయి.
హాలిడే కార్డ్ చేయండి :
ఈ ఐడియా ఎప్పటికీ పాతది కాదు, మీ కుటుంబ సభ్యులందరూ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగుల దుస్తులు ధరించి ఫోటోలు తీసి అందులో ఉత్తమమైన ఫోటోగ్రఫీని ఎంచుకుని హాలిడే కార్డ్ తయారుచేసి మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు పంపించవచ్చు.
క్రిస్మస్ పైజామా :
ఇది ఒక అందమైన సాంప్రదాయం. మీ కుటుంబం అంతా కూడా ప్రత్యేకమైన క్రిస్మస్ నేపథ్యంలో ఉన్న పైజామాలు ధరించవచ్చు. మీ చిన్నారిని ఎరుపురంగు క్రిస్మస్ జంప్ సూట్ తో అలంకరించవచ్చు. వారి ఫోటోలను తీసుకోవచ్చు.
మేజోళ్ళు :
ఇది పిల్లలకు ఎంతో ఉత్తేజకరమైన క్రిస్మస్ సాంప్రదాయాలలో ఒకటి. ఇక్కడ మీరు మీ చిన్న పిల్లల మేజోళ్ళను వేలాడు తీయవచ్చు మరియు వారు నిద్రలోకి జారుకున్న తర్వాత మీరు ప్రతి ఒక్కరికి బహుమతులను ఆమేజోళ్లలో ఉంచవచ్చు. నిద్ర లేచేసరికి వారి ముఖాలు ఆనందంతో నిండిపోతాయి.
శాంటా సందర్శన :
పసిబిడ్డలకు ఎప్పటికీ పాతబడని క్రిస్మస్ సాంప్రదాయాలలో ఇది ఒకటి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ శాంటాను ప్రేమిస్తారు. ఈ సమయంలో మీరు శాంటాను సందర్శించే సమయంలో మంచికెన్ తీసుకోవచ్చు మరియు అతని గురించి నేర్పించవచ్చు.
క్రిస్మస్ కోరల్స్ పాడండి :
మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే వారితో పాటు మీ స్నేహితుల మరియు బంధువుల పిల్లలను కూడా చిన్నపాటి పార్టీకి మీ ఇంటికి ఆహ్వానించండి. ఇతర సాంప్రదాయాల మాదిరిగానే మీ పిల్లలను క్రిస్మస్ కోరల్స్ పాడమని అడగండి లేదా దాని గురించి వారికి నేర్పించండి. రాబోవు దినాలలో మీ పిల్లలు సరదాగా ఈ సంప్రదాయాన్ని కొనసాగించడానికి ఇది ఉపయోగపడుతుంది.
క్రిస్మస్ వేడుకల సన్నాహాల్లో మీ పిల్లలను ఎలా భాగస్వాములను చేయాలి ?
మీరు అందరూ కూడా క్రిస్మస్ పండుగ సందర్భంగా బిజీగా ఉన్నందున, మీ పిల్లలకు కూడా ఈక్రింది జాబితాను ఇచ్చి క్రిస్మస్ ఈవ్ కార్యాచరణలో పాల్గొనమని చెప్పండి.
కార్డులు తయారు చేయడం :
సాధారణంగా సృజనాత్మకతతో నిండిన చిన్న పిల్లలకు, వారి ప్రియమైన వారికోసం క్రిస్మస్ కార్డ్ తయారు చేయకపోతే క్రిస్మస్ ఈవ్ అసంపూర్ణంగా ఉంటుంది. ఇది క్రిస్మస్ ఈవ్ సంప్రదాయం. వారు అందరిని అనుకరించడానికి ఇష్టపడతారు. మీ పిల్లలకు కొన్ని రంగు రంగుల కాగితాలను ఇవ్వండి. రకరకాల కళాకృతులను తయారు చేయమని చెప్పండి.
ఏంజెల్ ట్రీ :
క్రిస్మస్ యాక్టివిటీస్ ఎన్నో ఉంటాయి. కానీ ఇది నిజంగా ప్రత్యేకమైనది. మీరు ఒక క్రిస్మస్ ట్రీ ని ఖరీదు చేసి దానిని అలంకరిస్తున్నట్లయితే, మీ పిల్లలను కూడా ఒక ఏంజెల్ ట్రీ తీసుకునేందుకు అనుమతించండి. ఆ చిన్న చెట్టుని వారికి బహుమతిగా ఇవ్వవచ్చు మరియు అన్ని రకాల మెరుపులతో దానిని అలంకరించాలని వారిని ప్రోత్సహించండి.
క్రిస్మస్ మూవీ :
మీ పిల్లల కోసం అన్ని రకాల క్రిస్మస్ ఈవ్ ఐడియాలతో మీరు మునిగిపోతారు. మీరు కూడా మీకు ఇష్టమైన క్రిస్మస్ పైజామా ధరించి రాత్రంతా పిల్లలతో కలిపి అన్ని రకాల క్రిస్మస్ సినిమాలు చూడవచ్చు.
జింజర్ బ్రెడ్ హౌస్ :
మీరు ఎల్లప్పుడూ జింజర్‌బ్రెడ్ హౌస్ ని అలంకరించే తల్లిదండ్రులు అయితే, ఈ సంవత్సరం నుండి మీ పిల్లలను ఈ సాంప్రదాయాలలో భాగంగా దానికి అలంకరణను వారిని చేయనివ్వండి. వారు ఖచ్చితంగా దానిని ఆనందిస్తారు. చివరిగా తమ సృజనాత్మకతను స్నేహితులు మరియు బంధువులముందు గొప్పగా చెప్పుకుంటారు.
మీరు నిజంగా ఉత్సాహంగా ఉన్నట్లయితే, సంవత్సరపు ఉత్తమ పండుగను జరుపుకోవాలని అనుకుంటున్నట్లయితే, క్రిస్మస్ ఈవ్ సాంప్రదాయాలను ఈ విధంగా అనుసరించి మీ మనస్సులను సంతోషంతో నింపుకోండి.
క్రిస్మస్ గురించి ఉత్తమమైన విషయం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ ఈవ్ జరుపుకొనే వివిధ రకాల సాంప్రదాయాల గురించి మీ పిల్లలకు మీరు నేర్పించగలరు. మీరు అదృష్టవంతులు అయితే క్రిస్మస్ కోసం ప్రత్యేకమైన సాంప్రదాయాలను అనుసరించే ప్రాంతాలకు వెళ్లి సందర్శించవచ్చు. పైన ఇచ్చిన జాబితాలో నుండి కూడా మీరు ఎంచుకోవచ్చు.
మీ అందరికీ మెర్రీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Be the first to support
Be the first to share
Comment (0)
Related Blogs & Vlogs
No related events found.
Loading more...