పిల్లలలో వచ్చే పొట్ట ఇన్ఫెక్షన్లు..

All age groups

Aparna Reddy

3.9M వీక్షణలు

5 years ago

పిల్లలలో వచ్చే పొట్ట ఇన్ఫెక్షన్లు..

వేడి మరియు తేమతో కూడిన వాతావరణం లో పిల్లలలో పొట్ట ఇన్ఫెక్షన్లు రావడం అన్నది చాలా సాధారణం. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు ఇంటికి పరిమితమై పోయారు. ఈ సమయంలో వారు నీటిని తీసుకోవడం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇవన్నీ పిల్లలలో పొట్ట ఇన్ఫెక్షన్లు రావడానికి కారణం అవుతాయి.

Advertisement - Continue Reading Below

 

పొట్ట ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి ?

 

పొట్టలో ఇన్ఫెక్షన్ లేదా జీర్ణశయాంతర ప్రేగులలో సోకిన ఇన్ఫెక్షన్. ఇది పొట్ట ఉబ్బడం , విరోచనాలు , వాంతులు , వికారం మరియు కడుపు నొప్పిని కలిగిస్తుంది.

 

పిల్లల పొట్టలో సంభవించే ఇన్ఫెక్షన్ ఎంత తీవ్రమైనది ?

 

పిల్లల పొట్టలో సంభవించే ఇన్ఫెక్షన్ లో ప్రధానమైనది డీహైడ్రేషన్ కు దారి తీయడం. ఇది తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. అలాగే ఎక్కువగా వాంతులు మరియు  నీళ్ల విరోచనాలు ఎలక్ట్రోలైట్ స్థాయిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. శరీరంలో సోడియం మరియు పొటాషియం చాలా తక్కువ స్థాయికి పడిపోయినప్పుడు అది బిపి మరియు హృదయ స్పందన రేటు వంటి వాటి పై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది.

 

పిల్లల పొట్టలో సంభవించే ఇన్ఫెక్షన్లకు సాధారణమైన కారణాలు :

 

వైరస్లు

 

బ్యాక్టీరియా (ఫుడ్ పాయిజనింగ్)

 

పేగు పరాన్నజీవులు

వైరల్ గ్యాస్ట్రోఎంటరటిస్

 

జీర్ణ వ్యవస్థ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్లు గ్యాస్ట్రోఎంటరటిస్ ద్వారా తేలికగా ప్రవేశిస్తాయి. పిల్లలలో వైరల్గ్యాస్ట్రోఎంటరటిస్ సాధారణంగా రోటా వైరస్ లు, ఆస్ట్రో వైరస్లు, ఆడేనో వైరస్లు, ఎంట్రో వైరస్లు, మరియు నోరో వైరస్ల ద్వారా సంభవిస్తుంది. ఏది ఏమైనప్పటికీ , ఐదు సంవత్సరాలు కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో రోటా వైరస్ లు పొట్టలోని ఇన్ఫెక్షన్లకు ప్రధాన కారణం. వైరల్ గ్యాస్ట్రోఎంటరటిస్ సాధారణంగా ఒకటి నుండి మూడు రోజులు ఉంటుంది.

 

పిల్లలకు ఇది ఎలా సంక్రమిస్తుంది ?

 

సాధారణంగా, పిల్లలు కలుషితమైన వాటిని తాకడము మరియు ఆ చేతులు కడుక్కోకుండా చేతులను నోటిలో పెట్టుకోవడం ద్వారా ఈ వైరస్ సంక్రమిస్తుంది.

 

బ్యాక్టీరియల్ గ్యాస్ట్రోఎంటరటిస్ :

 

ఈ పేరు పలకడానికి కొంచెం కష్టతరంగా అనిపించినప్పటికీ, కలుషితమైన ఆహారం ద్వారా సంభవించే దీనికి మరొక పేరు ఫుడ్ పాయిజనింగ్. ఆహారాన్ని సరిగ్గా వండక పోవడం లేదా సరిగా నిల్వ చేయకపోవడం తద్వారా బ్యాక్టీరియా దానిపై వృద్ధిచెందడం ప్రారంభిస్తుంది. ఈ బ్యాక్టీరియా టాక్సిన్స్ అనే రసాయన ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఒకవేళ పిల్లలు ఈ ఆహారాన్ని తీసుకుంటే గ్యాస్ట్రోఎంటరటిస్ లక్షణాలు మొదలవుతాయి. కొన్ని సార్లు కొన్ని రకాల బ్యాక్టీరియా వలన తీవ్రమైన జ్వరాలు, కడుపులో నొప్పి మరియు విపరీతమైన వాంతులకు కారణం అవుతాయి.

 

ఇది పిల్లలలో ఎలా సంభవిస్తుంది ?

 

సాధారణంగా, పిల్లలు కలుషితమైన నీరు లేదా ఆహారం తీసుకోవడం ద్వారా ఈ బ్యాక్టీరియా సంభవిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో యాంటీబయాటిక్స్ కోర్సు తీసుకునే సమయంలో లేదా ఆ తరువాత కూడా బ్యాక్టీరియల్ గ్యాస్ట్రోఎంటరటిస్ శరీరంలోనికి ప్రవేశిస్తుంది.

 

పేగు పరాన్నజీవులు :

 

కలుషితమైన ఆహారము మరియు నీరు మరియు సరిగ్గా ఉడికించని ఆహారం నుండి వచ్చే పరాన్నజీవులు పిల్లల కడుపులో  బ్యాక్టీరియా సంభవించేందుకు కారణం అవుతాయి.

 

పిల్లలకు ఇది ఎలా సంభవిస్తుంది ?

 

పిల్లలకు ఇది కలుషితమైన ఆహారము లేదా నీరు  మరియు మురికి చేతుల ద్వారా కూడా సంక్రమించవచ్చు.

 

పొట్టలో తలెత్తే ఇన్ఫెక్షన్ల యొక్క లక్షణాలు ఏమిటి ?

 

గ్యాస్ట్రోఎంటరటిస్ బారినపడిన 90 శాతం మంది పిల్లలకు తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా ఈ లక్షణాలు పిల్లల్లో 24 గంటల నుండి వారం రోజుల పాటు ఉంటాయి. అయినప్పటికీ పరాన్నజీవి వలన కడుపులో ఇన్ఫెక్షన్ సోకి నట్లయితే లక్షణాలు ఎక్కువ సమయం ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక విరోచనాలకు కారణం అవుతుంది. దీనివలన అలసట మరియు బరువు తగ్గడం జరుగుతుంది.

 

పిల్లలలో తేలికపాటి ఇన్ఫెక్షన్ల వల్ల సంభవించే లక్షణాలు :

 

ఆకలి లేకపోవడం

 

తేలికపాటి విరోచనాలు

 

కడుపు నొప్పి

 

వాంతులు

 

వికారం

 

తలనొప్పి

 

కొద్దిపాటి జ్వరం

 

పిల్లలలో ఇన్ఫెక్షన్ ఎక్కువైన సందర్భాలలో తలెత్తే లక్షణాలు :

 

రెండు వారాల కంటే ఎక్కువగా ఉంటే అధికమైన నీటి విరోచనాలు.

 

డిహైడ్రేషన్ సంకేతాలు

 

రక్తము లేదా చీముతో కూడిన మలవిసర్జన.

 

ఎక్కువ రోజుల పాటు తీవ్ర జ్వరం ఉండడం.

 

పొట్ట లో ఇన్ఫెక్షన్ ఎంతకాలం ఉంటుంది ?

 

సాధారణంగా తేలికపాటి ఇన్ఫెక్షన్ ఒకటి నుండి మూడు రోజుల మధ్య ఉంటుంది. 24 గంటల లోపల వాంతులు తగ్గిపోతాయి. అన్ని లక్షణాలు తగ్గిపోయినప్పటికీ కూడా పిల్లలకు అప్పుడప్పుడు విరోచనాలు ఉండే అవకాశం ఉంటుంది.

 

పిల్లలలో గ్యాస్ట్రోఎంటరటిస్ ఉన్నప్పుడు చేయకూడని కొన్ని పనులు :

 

పిల్లలకు పొట్ట ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు తెలుసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఇక్కడ ఉన్నాయి...

 

ఎక్కువ నూనెతో కూడిన లేదా కారంగా ఉండే ఆహారాన్ని ఇవ్వకూడదు.

 

శీతల పానీయాలు, కార్బోనేట్ పానీయాలు ఇవ్వకూడదు.

 

Advertisement - Continue Reading Below

పంచదార కలిపిన జ్యూసులను ఇవ్వకండి.

 

పొట్టలో ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గేవరకు పిల్లలను స్కూలుకు పంపకండి.

 

కెఫిన్ పానీయాలు మరియు కాఫీలను ఇవ్వద్దు. పొట్టలోని ఇన్ఫెక్షన్ నుండి త్వరగా కోలుకోవడానికి విశ్రాంతి మరియు నిద్ర ఎంతో ముఖ్యమైనవి.

 

పాల ఉత్పత్తులు మరియు ఫైబర్ అధికంగా ఉండే ఆహారం ఇవ్వకండి.

 

డాక్టర్ అనుమతి లేకుండా యాంటీ డయోరియా మందులను పిల్లలకు ఇవ్వకండి. ఈ మందుల నుండి హానికరమైన సూక్ష్మజీవులు ప్రవేశించి జీర్ణ వ్యవస్థకు ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఇది పరిస్థితిని మరింత దిగజారుస్తుంది.

 

పిల్లలకు కడుపులో వచ్చే ఇన్ఫెక్షన్ ను ఎలా నివారించవచ్చు ?

 

రోటా వైరస్ వ్యాక్సిన్ రోటా వైరస్ వల్ల సంభవించే ఇన్ఫెక్షన్ నుండి పిల్లలను రక్షించడానికి సహాయపడుతుంది.

 

ఇతర నివారణ చర్యలు :

 

సరైన వ్యక్తిగత పరిశుభ్రతను పాటించండి.

 

ఆహారం తినడానికి ముందు చేతులు సబ్బు మరియు నీటితో శుభ్రంగా కడుక్కోండి.

 

సలాడ్ లు తయారు చేసే ముందు కూరగాయలు మరియు పండ్లను బాగా కడగాలి.

 

మాంసాన్ని బాగా ఉడికించాలి.

 

వంటగదిని మరియు పాత్రలను చక్కగా మరియు పరిశుభ్రంగా ఉంచండి.

 

పిల్లలకు ఎప్పుడూ పాశ్చరైస్ చేయని పాలను ఇవ్వకండి.

 

పరిశుభ్రంగా లేని ప్రదేశాలకు వెళ్లేటప్పుడు వాటర్ బాటిల్ మీద ఆధారపడే విధంగా చూసుకోండి.

 

రోడ్డు మీద దొరికే ఆహారాన్ని పిల్లలను తిననివ్వకండి.

 

ఆహారంపై ఎప్పుడు మూతలు తెరిచి ఉంచవద్దు. ఆహారంపై తప్పక మూత వేసి ఉంచండి.

 

పిల్లలలో పొట్ట ఇన్ఫెక్షన్లకు చికిత్స :

 

పిల్లలలో తేలికపాటి ఇన్ఫెక్షన్లు తగినంత విశ్రాంతి మరియు సరిపడినంత ద్రవాలు ఇచ్చినట్లయితే సరిపోతాయి. సాధారణంగా వైద్యులు వైరస్ దానంతట అదే తగ్గిపోవాలి అని సలహా ఇస్తారు. దీని కోసం ఇచ్చే మందుల కారణంగా లక్షణాలను మరింత దిగజార్చి మరియు ఎక్కువ సమయం తీసుకుంటాయి. మరియు తీవ్రమైన లక్షణాలతో బాధపడుతున్నట్లయితే  డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉండడం వలన డాక్టర్ పర్యవేక్షణలో ఉంచడం కోసం ఆసుపత్రికి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది.

 

డీహైడ్రేషన్ ను నివారించడానికి :

 

పిల్లలను పుష్కలంగా నీటిని తాగమని కోరండి. నీటిని ఎక్కువగా తీసుకునే సమయంలో వికారంగా అనిపిస్తున్నట్లయితే కొంచెం కొంచెంగా ఎక్కువ నీటిని తీసుకోమని సూచించండి.

 

సరైన రీహైడ్రేషన్ కోసం నీరు మాత్రమే తీసుకుంటే సరిపోదు. విరోచనాలు మరియు వాంతులు కారణంగా పిల్లలు ఎలక్ట్రోలైట్లను గణనీయంగా కోల్పోతారు. ఎలక్ట్రోలైట్లను కోల్పోవడం వలన రక్తంలో సోడియం స్థాయి ప్రమాదకరంగా పడిపోతుంది.

రీహైడ్రేషన్ కొరకు నాలుగు కప్పుల నీటిలో ఆరు స్పూన్ల పంచదార మరియు 1/4 స్పూన్ ఉప్పు కలిపి ఇవ్వండి. పిల్లల రీహైడ్రేషన్ కు ఇది మంచి పరిష్కారం.

 

పొట్టలో ఇన్ఫెక్షన్ వచ్చిన సమయంలో పిల్లలు ఏమి ఆహారం తీసుకోవాలి ?

 

పిల్లల్లో వాంతులు తగ్గడం తో మీరు ఆహారం ఇవ్వడం ప్రారంభించవచ్చు. మీరు పిల్లలకు సాధారణ ఆహారాన్ని తిరిగి ఇవ్వవచ్చు. కానీ రీహైడ్రేటెడ్ ఆహారాన్ని ఇస్తూ ఉండాలి.

సులభంగా జీర్ణమయ్యే ఆహారంతో ప్రారంభించండి. అరటి పండ్లు , అన్నము ఆపిల్ జ్యూస్ మరియు టోస్టులను ఇవ్వండి . కొంచెం పెద్ద పిల్లలకైతే ఉడికించిన లేదా గ్రిల్ చేసిన చికెన్, లేత మాంసము మరియు ఉడికించిన బంగాళదుంపలను కూడా ఇవ్వవచ్చు. కొద్ది రోజుల వరకు పిల్లలకు కొవ్వు పదార్థాలను మరియు చక్కెర తో కూడిన పానీయాలను ఇవ్వకండి.

 

ఈ సమయంలో పిల్లలకు వాంతులు లేదా కడుపులో తిప్పినట్లుగా ఉన్నట్లయితే కడుపు ఇంకా ఘనమైన ఆహారానికి సిద్ధంగా లేదని అనుకోండి. అందువలన ఘన పదార్థాలను ప్రారంభించడానికి మరి కొంత సమయం వేచి ఉండండి.

 

పిల్లలకు పొట్టలో ఇన్ఫెక్షన్ సంభవించినప్పుడు డాక్టర్ దగ్గరకు ఏ సందర్భంలో తీసుకువెళ్లాలి ?

 

పొట్టలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాంతులు,  విరోచనాలు , జ్వరము , కడుపు నొప్పి మరియు ఆకలి లేకపోవడం లాంటివి సంభవిస్తాయి. ఈ కారణాలన్నీ కూడా డీహైడ్రేషన్ కు దోహదం చేస్తాయి. డీహైడ్రేషన్ యొక్క లక్షణాలు కనిపించినట్లయితే వైద్య సహాయం అవసరం ఉంటుంది.

 

ఈ సమయాలలో వెంటనే వైద్య సహాయం తీసుకోండి :

 

ఐదు రోజుల తర్వాత కూడా లక్షణాలు మెరుగు పడకపోతే.

 

తీవ్రమైన జ్వరం.

 

విపరీతమైన కడుపునొప్పి లేదా పొట్టవాపు గా ఉండడం.

 

అటువంటి ఆరోగ్య పరిస్థితులు పిల్లల రోగ నిరోధక శక్తిని దెబ్బ తీస్తాయి.

 

పిల్లలు రోగ నిరోధక శక్తిని తగ్గించే మందులు వాడుతున్నట్లయితే వాంతి చేసుకునే సమయంలో రక్తము లేదా ఆకుపచ్చ రంగు ద్రవం కనిపిస్తున్నప్పుడు..

 

మలవిసర్జన సమయంలో రక్తం రావడం.

 

పిల్లల్లో డయాబెటిస్ ఉన్నట్లయితే..

 

ఇటువంటి సందర్భాలలో తప్పకుండా హాస్పిటల్ కు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పిల్లలు బాగా హైడ్రేట్ గా ఉండే విధంగానూ మరియు ఖచ్చితమైన పరిశుభ్రతను పాటించే విధంగానూ చూసుకోండి.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Be the first to support

Be the first to share

support-icon
Support
share-icon
Share

Comment (0)

share-icon

Related Blogs & Vlogs

No related events found.

Loading more...