Food and Nutrition

గర్భధారణ సమయంలో క్యాబేజ్ ఎంత సురక్షితం

Aparna Reddy
Pregnancy

Created by Aparna Reddy
Updated on Sep 11, 2020

Reviewed by Expert panel

గర్భధారణ అనేది స్త్రీ జీవితంలో కీలకమైన దశ. గర్భం ఆమెకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగించడమే కాక, ఆమెకు కొన్నిసార్లు హాని కూడా చేస్తుంది. ఆమె ఆహారం లేదా జీవన శైలికి సంబంధించి ఏదైనా నిర్లక్ష్యం చేసినట్లయితే అది ఆమె పుట్టబోయే బిడ్డ యొక్క అభివృద్ధిని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి మీరు బిడ్డ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఆరోగ్యమైన ఆహారం తీసుకోండి. మీరు గర్భవతిగా ఉన్నప్పుడు పుష్కలంగా తీసుకోవాల్సిన ఆహారాలలో కూరగాయలు మరియు ఆకుకూరలు. అయితే అన్ని ఆకుకూరలు అధికమైన పోషక విలువలు కలిగి ఉన్నప్పటికీ గర్భధారణ విషయంలో అవన్నీ సురక్షితమా? ఇక్కడ గర్భధారణ సమయంలో క్యాబేజీ తినడం లోని భద్రతను పరిశీలిద్దాం!

 

క్యాబేజీ యొక్క పోషక విలువలు :

 

క్యాబేజ్ ఎన్నో పోషకాలకు మంచి మూలం. 100 గ్రాముల క్యాబేజీ లో ఉన్న కొన్ని ప్రధాన పోషకాలు సుమారుగా...

విటమిన్ సి - 61%

డైటరీ ఫైబర్ - 10%

విటమిన్ బి 6 - 5%

పొటాషియం - 4%

క్యాల్షియం - 4%

మెగ్నీషియం - 3%

ఐరన్ -2%

విటమిన్  ఏ - 1%

ప్రోటీన్ -2%

ఫాస్పరస్, ఫోలేట్, మాంగనీస్ , విటమిన్ కె, బి1 మరియు బీ 2 కూడా ఉన్నాయి.

 

గర్భధారణ సమయంలో క్యాబేజ్

సురక్షితమేనా ?

 

గర్భధారణ సమయంలో సరిగ్గా వండిన క్యాబేజీ తినడం సురక్షితం . కానీ, ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి :

 

తల్లి కాబోతున్న వారికి ఉపయోగపడే అనేక వైద్య ప్రయోజనాలు క్యాబేజీలో ఉన్నాయి.

 

దీనిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి మరియు గర్భధారణ సమయంలో తీసుకుని మల్టీవిటమిన్ మాత్రలకు సమానమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

 

గర్భధారణ సమయంలో  ప్రతిరోజు క్యాబేజ్ తీసుకున్న తల్లులకు జన్మించిన పిల్లలు కొన్ని రకాల క్యాన్సర్ల రోగనిరోధకశక్తిని కలిగి ఉన్నారు అని పరిశోధనలు నిర్దేశించాయి.

 

ఏది ఏమైనప్పటికీ, గర్భధారణ సమయంలో పచ్చి క్యాబేజీని తినడం సురక్షితం కాదు అన్నది గమనించవలసిన విషయం.

 

గర్భధారణ సమయంలో పచ్చి క్యాబేజీని తినడం సురక్షితమేనా ?

 

మరింత తెలుసుకోండి..

 

అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోతే గర్భధారణ సమయంలో పచ్చి క్యాబేజీని తినడం సురక్షితం కాదు. క్యాబేజీ బాక్టీరియా మరియు ఫంగస్ ద్వారా సులభంగా కలుషితం అవుతుంది . కాబట్టి ఇది లిస్టేరియా వంటి ఆహారపదార్ధ అనారోగ్యానికి కారణం అవుతుంది. లిస్టేరియా వలన గర్భస్రావము , ముందస్తు ప్రసవము , నవజాత శిశువులకు ప్రాణాంతక వ్యాధులు మరియు ప్రసవం సమయంలో అనేక రకమైన సమస్యలకు దారి తీస్తుంది. క్యాబేజీ సాగు సమయంలో పురుగుమందులు మరియు క్రిమిసంహారిణి మందులు నిరంతరం ఉపయోగించడం వలన కూడా క్యాబేజీ కలుషితం అవుతుంది. తద్వారా గర్భధారణ సమయంలో పచ్చిగా క్యాబేజీని తీసుకోవడం సురక్షితం కాదు. క్యాబేజీని వండడం (ఆవిరి మీద లేదా ఉడికించడం, లేదా వేయించడం) వలన పురుగుమందులు మరియు సూక్ష్మజీవుల ప్రభావాన్ని కొంత వరకు పరిమితం చేస్తుంది.

 

గర్భధారణ సమయంలో క్యాబేజీ తినడం వలన కలిగే ప్రయోజనాలు :

 

క్యాబేజీ తల్లి కాబోతున్న వారికి చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. గర్భధారణ సమయంలో క్యాబేజ్ ను తీసుకోవడం వలన కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి:

 

మలబద్ధకాన్ని నివారిస్తుంది :

 

క్యాబేజీ లో ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుంది. అందువల్ల రోజు వారి ఆహారంలో క్యాబేజీని చేర్చడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో సాధారణంగా తలెత్తే  ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది మరియు మలబద్ధకాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది .

 

గర్భధారణ మధుమేహ ప్రమాదాన్ని తగ్గిస్తుంది :

 

క్యాబేజీలో ఫైబర్ శాతం అధికంగా ఉన్నందు వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి తల్లి కాబోతున్న వారిలో మధుమేహం వచ్చే అవకాశాలు తగ్గించడానికి సహాయపడుతుంది.

 

పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి ఉపయోగపడుతుంది :

 

క్యాబేజీ లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది

జన్యుపరంగా తలెత్తే న్యూరల్ ట్యూబ్ జనలోపాలవంటి పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి సహాయపడుతుంది.

 

బరువు పెరగడాన్ని నియంత్రిస్తుంది :

 

గర్భవతులకు తమ రెండవ మరియు మూడవ త్రైమాసికంలో ప్రవేశించిన తరువాత రోజుకి 300 అదనపు క్యాలరీలు మాత్రమే అవసరం ఉంటుంది. క్యాబేజీ లో అతి తక్కువ కేలరీలు ఉంటాయి. మరియు పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల రోజు వారి ఆహారంలో క్యాబేజీని చేర్చడం గర్భిణీ స్త్రీలు పోషకాహారంతో పాటు గర్భధారణ సమయం అంతా కూడా బరువు పెరగకుండా ఉండడానికి సహాయపడుతుంది.

 

వాపును నివారిస్తుంది :

 

గర్భం యొక్క మూడవ త్రైమాసికంలో చాలా సాధారణంగా వచ్చే కాళ్లవాపును తగ్గించడానికి  క్యాబేజీ ఆకులను ఉపయోగిస్తారు. క్యాబేజీ ఆకులను కాళ్ళ చుట్టూ చుట్టడం వలన వాపును తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

 

రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది :

 

క్యాబేజీ లో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది . ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచడంతోపాటు మరియు ఆర్ బీసీ ని ఉత్పత్తి చేయడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది . అందువల్ల గర్భధారణ సమయంలో క్యాబేజీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది . ఇది గర్భధారణ సమయంలో కనిపించే మరొక సాధారణ సమస్య.

 

రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది :

 

క్యాబేజీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి గర్భధారణ సమయంలో రోగనిరోధకశక్తిని పెంచడానికి సహాయపడుతాయి

 

రక్తపోటును నియంత్రిస్తుంది :

 

క్యాబేజీ లో ఇనుము, క్యాల్షియం, మాంగనీస్,  మెగ్నీషియం,  పొటాషియం మరియు ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నందు వల్ల ఎలక్ట్రోలైట్ లు సమృద్ధిగా దొరుకుతాయి. ఈ కనిజాలు హృదయ స్పందన రేటును మరియు రక్తపోటును నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

 

క్యాన్సర్ నిరోధక శక్తిని కలిగి ఉంటుంది :

 

క్యాబేజీలో ఆంతోసైనిక్స్  ఉంటాయి . ఆంతోసైనిక్స్ స్వతహాగా క్యాన్సర్ నిరోధక కణాలకు కలిగి ఉంటాయి.

ఆంతోసైనిక్స్ కేన్సర్ కలిగించే కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. అందువల్ల క్రమం తప్పకుండా క్యాబేజ్ ను తీసుకున్నట్లయితే క్యాన్సర్ను నివారించడానికి సహాయపడడమే కాకుండా ఇప్పటికే చెప్పినట్టుగా, గర్భధారణ సమయంలో క్రమం తప్పకుండా క్యాబేజీ తీసుకునే తల్లికి పుట్టే పిల్లల జీవితం అంతా కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

 

గర్భధారణ సమయంలో చైనీస్ క్యాబేజీ సురక్షితమేనా ?

 

చైనీస్ క్యాబేజీ లో ఎన్నో రకాలు ఉన్నాయి. సాధారణంగా మనం ఉపయోగించే రకం నాపా క్యాబేజ్. ఇది గట్టిగా రింగులు తిరిగిన ఆకుపచ్చ ఆకులతో ఉంటుంది. దీనిని చైనీస్ వంటకాలలో ఉపయోగిస్తారు. సూక్ష్మజీవులు మరియు పురుగుమందులతో కలుషితం కావడం వలన దీనిని నీటితో బాగా కడగాలి. దీనిని వంటలు మరియు సూపు లలో ఉపయోగించినప్పుడు మంచి రుచిని ఇస్తుంది. ఇది సాధారణ క్యాబేజి వలే ఉపయోగకరంగా ఉంటుంది.

 

గర్భధారణ సమయంలో క్యాబేజ్ జ్యూస్ సురక్షితమేనా ?

 

గర్భధారణ సమయంలో క్యాబేజీ రసం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది . మీకు క్యాబేజ్ అలర్జీ లేకపోతే క్యాబేజీ రసం తాగడం సురక్షితం . క్యాబేజీ కారణంగా గ్యాస్ ఏర్పడటానికి అవకాశం ఉంటుంది . కాబట్టి గ్యాస్ ప్రాబ్లం ఉన్నవారు క్యాబేజీ మరియు క్యాబేజ్ రసానికి దూరంగా ఉండండి . క్యాబేజీ జ్యూస్ లో క్యారెట్ జ్యూస్ కూడా కలిపి తాగినట్లయితే గర్భధారణ సమయంలో ఒక ఆరోగ్యకరమైన ఆహారం అవుతుంది.

 

గర్భధారణ సమయంలో క్యాబేజీని తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

 

ఇప్పటికే చెప్పినట్లుగా, క్యాబేజీ ఎన్నో వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులు మరియు పురుగుమందులను కలిగి ఉంటుంది. అందువలన...

 

క్యాబేజీ ను వంట చేయడానికి లేదా సలాడ్లలో ఉపయోగించడానికి ముందు బాగా కడగాలి . ఒక్కసారి కడిగితే సరిపోదు అని గుర్తుంచుకోండి.

 

గర్భధారణ ఈ సమయంలో ప్రయోగాలు చేయడం మంచిది కాదు. అందుకే క్యాబేజీని పచ్చిగా తీసుకోకుండా వండిన క్యాబేజీ ను తీసుకోవడం మంచిది.

 

క్యాబేజీని అధికంగా ఉడికించడం వల్ల దాని పోషకాలు పాడవుతాయి. అందుకే క్యాబేజీని తక్కువ నూనె లో ఐదు నిమిషాలు పాటు అధిక మంటలో  వేపడం మంచిది.

 

సేంద్రియ స్థలాలలో పండించిన క్యాబేజీని కొనండి.

 

కట్ చేసిన క్యాబేజ్ ను ఎప్పుడూ కొనకండి. క్యాబేజీ కట్ చేసిన క్షణం నుండి దాని పోషక విలువలు తగ్గడం ప్రారంభం అవుతుంది.


వంట కోసం తాజాగా కట్ చేసిన క్యాబేజీని ఉపయోగించండి. వంట చేయడానికి ముందు ముక్కలు చేసిన క్యాబేజీని పది నిమిషాల పాటు పక్కన ఉంచండి. ఎందుకంటే క్యాబేజీ లోని మైరోసినేస్ ఎంజైములు ఐదు నుండి ఏడు నిమిషాల పాటు మాత్రమే చురుకుగా ఉంటాయి.

This content has been checked & validated by Doctors and Experts of the parentune Expert panel. Our panel consists of Neonatologist, Gynecologist, Peadiatrician, Nutritionist, Child Counselor, Education & Learning Expert, Physiotherapist, Learning disability Expert and Developmental Pead.

  • Comment
Comments ()
Kindly Login or Register to post a comment.
+ Start A Blog

Top Food and Nutrition Blogs

Ambili S Kartha

Featured Mombassador

Pregnancy

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}