• లాగ్ ఇన్
 • |
 • నమోదు చేయు
ఫుడ్ అండ్ న్యూట్రిషన్

1-3 వయస్సుపిల్లలకు వెరైటీ వంటలు

Canisha Kapoor
1 నుంచి 3 సంవత్సరాలు

Canisha Kapoor సృష్టికర్త
నవీకరించబడిన Feb 10, 2020

1 3
నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

పోషకాహారం మీ బిడ్డ శారీరక మరియు మానసిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది .ఒకటి(1) నుంచి మూడు(3) సంవత్సరాల వయస్సు కలిగి ఉన్న పిల్లలకి సరిఅయిన పోషకాహారం అందించడం ఎంతో అవసరం.  

పిల్లల కోసం ఆరోగ్యకరమైన ఆహారం అల్పాహారంతో మొదలవుతుంది. అందుకని ముందు గా పసి పిల్లల కొరకు మంచి పోషకాలు కలిగిన అల్పాహార రెసిపీ.

రాగి ఇడ్లీ:

కావలసిన పదార్ధాలు : (240 ml కప్ ఉపయోగించబడింది)

 • 2 కప్పులు ఇడ్లీ పిండి  (మెత్తటి పిండి)

 • ½ కప్ రాగి పిండి లేదా నాచినీ పిండి (తక్కువ ఉపయోగించవచ్చు కానీ ఎక్కువ వాడకూడదు )

 • ¼ కప్ నీరు +2 టేబుల్ స్పూన్లు గోరు వెచ్చని నీరు (అవసరమైతే 1 టేబుల్ స్పూన్ మరింత జోడించండి)

 • ఉప్పు (తగినంత )

 • ½ స్పూన్ నూనె

తయారీ విధానం

 • ముందుగా ¼ కప్ నీటిని మరిగించండి.

 • ఒక బౌల్ లో రాగి పిండి ని తీస్కొని ,దానిలో తగినంత నీటిని కలుపుతూ  చిక్కటి పేస్ట్ లాగ చేసుకోవాలి.

 • తరువాత దానికి  పులియబెట్టిన ఇడ్లీ పిండి  మరియు ఉప్పు కలపండి. నీటిని శోషించటానికి పిండికి 15 నుండి 20 నిమిషాలపాటు  పక్కన పెట్టండి.

 • ఇడ్లి స్టీమర్  లేదా కుక్కర్ లో నీటిని నింపుకొని ఉడికించడానికి సిద్ధం చేసుకోవాలి

 • ఇంతలో కుక్కర్ ప్లేట్స్ కి నూనె ని పూసి, ముందు గా తయారు చేసిన  పిండి ని పోయాలి

 • కుక్కర్ లోని నీరు మరగడం ప్రారంభించాక పిండి పోసిన కుక్కర్ ప్లేట్స్ ను అందులో పెట్టండి

 • 10  నిమిషాల పాటు మూత వేసి ఉడికించండి

 • ఉడికిన తరువాత మూత ని తెరిచి చల్లారనివ్వండి

 • నీటితో ఒక చెంచా అంచుని ముంచండి మరియు దానిని ఉపయోగించి ఇడ్లిస్ ని బయటకు తియ్యండి

 • సాంబార్ లేదా చట్నీతో రగి ఇడ్లీని వేడిగా మీ పిల్లలకు అందించండి.

ఇప్పుడు భోజనం గా పిల్లలకు అందించడానికి ఉపయోగ పడే వంటకం :

బంగాళాదుంప అన్నం

కావలసిన పదార్ధాలు:

 • 2 టేబుల్ స్పూన్లు. దీర్ఘ ధాన్యం బియ్యం(లాంగ్ గ్రైన్)

 • 50 గ్రాముల బంగాళదుంప

 • 1/8 కారొమ్ సీడ్ పౌడర్ (వాము )

 • 135 ml నీరు (ఉపయోగించిన బియ్యం రకం మీద ఆధారపడి ఉంటుంది)

 • ఒక చిటికెడు ఉప్పు

 • చిటికెడు పసుపు

తయారీ విధానం

గమనిక

ఈ రెసిపీ పిల్లల వయసుకు తగినట్టుగా వారికీ అందించాలి. 1 లేదా అంత కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు రైస్ (అన్నం) ముద్దగా మరియు మృదువుగా చేసి తినిపించాలి 2-3 వయసు పిల్లలకి ఏధావిధి గా రెసిపీ లో తెలిపిన విధం గా అందించవచ్చు.

పసిపిల్లలకు స్నాక్స్ - మాంగో సల్సా

కావలసినవి (240 ml కప్ ఉపయోగించబడింది):

 • 1 కప్పు మామిడి ముక్కలు

 • 1 టమోటా మీడియం

 • 2 నుండి 3 టేబుల్ స్పూన్లు తరిగిన దోసకాయలు

 • 1 ఉల్లిపాయ చిన్నది

 • 1 పచ్చి మిరప ( తరిగినది)

 • పెప్పర్ పౌడర్ (తగినంత)

 • మింట్ లేదా కొత్తిమీర (తగినంత)

 • ఉప్పు(తగినంత)

 • 1 టేబుల్ స్పూన్ 1 స్పూన్ హనీ.

 • 2 Tbsps పీనట్స్

తయారీ విధానం

రాత్రి విందు (డిన్నర్)

రాత్రి వేళలో అందించే ఆహారం మంచి పోషక విలువలు కలిగి ఉన్నదై ఉండాలి. ఎందుకంటే అది పిల్లలకు మంచి నిద్రని అందిస్తుంది

క్యారెట్ బేబీ ఫుడ్ రెసిపీ:

కావలసిన పదార్ధాలు

 • ఒక కార్రోట్ ( పెద్దది )

 • 6 లేక 8 బాదాం పప్పులు

 • బాదం పాలు / పాలు/ నీరు (తగినంత)

 • బెల్లం (కొద్దిగా తరిగినది )

 • 1 /4 స్పూన్ నెయ్యి

తయారీ విధానం

 • ముందుగా బాదాం పప్పులను  6 గంటల పాటు నీటి లో నానబెట్టి ..పొట్టుని తియ్యాలి  

 • తరువాత కార్రోట్ ని శుభ్రం గా కడిగి చిన్న చిన్న ముక్కలు గా తరగాలి

 • మిక్సర్ లో కార్రోట్ ముక్కలు, బాదాం ముక్కలు ,పాలు / నీటిని కలిపి మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి.ఆ తయారు అయినా పేస్ట్ ని ఒక గిన్నె లోకితీసుకోవాలి

 • అదే గిన్నెలో నీటిని పోసి మరిగించుకోవాలి.అలాగా ఒక 12 నుంచి 15 నిముషాల పాటు ఉడికించుకోవాలి

 • అది కాస్త చిక్కపడ్డాక బెల్లాన్ని కలపాలి

 • కలిపినా తరువాత చల్లారడానికి ఫ్రిడ్జ్ లో పెట్టాలి.చల్లారిన తరువాత పిల్లలకు అందించండి

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

 • 1
వ్యాఖ్యలు()
Kindly Login or Register to post a comment.

| Dec 16, 2018

super

 • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}