1. జలుబు మరియు దగ్గు ఉన్నప్పుడు ఎ ...

జలుబు మరియు దగ్గు ఉన్నప్పుడు ఎటువంటి ఆహారాన్ని ఎంచుకోవాలి మరియు గృహ నివారణలు

Age Group: All age groups

4.2M views

జలుబు మరియు దగ్గు ఉన్నప్పుడు ఎటువంటి ఆహారాన్ని ఎంచుకోవాలి మరియు గృహ నివారణలు

Published: 12/11/20

Updated: 12/11/20

చిన్నపిల్లలు కొన్నిసార్లు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. విరోచనాలు, వాంతులు, మలబద్ధకం, జలుబు మరియు దగ్గు - ఇవి చిన్న పిల్లలు మరియు తల్లిదండ్రులు ఎదుర్కొనే సాధారణమైన సమస్యలు. వైరల్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు సూచనగా జలుబుతో పాటుగా దగ్గు లేదా జ్వరం ఉంటుంది. 

 

మొట్టమొదటిసారిగా తల్లి అయిన మీరు పిల్లలు దగ్గు మరియు జలుబుతో విసిగి పోతున్నారా ? అసౌకర్యంతో బాధపడుతున్న మీ చిన్నారిని చూడడం మీకు నిస్సహాయంగా అనిపిస్తుందా? అవును అయితే, చింతించకండి. మన సహా బ్లాగర్ అయిన పూజ కౌశిక్ గారు ఇటువంటివారి కోసం కొన్ని సులభమైన గృహ నివారణ చిట్కాలను పంచుకుంటున్నారు.

 

పసిబిడ్డలలో జలుబు, దగ్గు మరియు జ్వరం :

మీ చిన్నారి నిరంతరం తుమ్ముతూ ఉండడం, లేదా ముక్కు కారడం, లేదా దగ్గుతో కష్టపడడం ఇలాంటివి చూడటం ఎంతో ఇబ్బందిని కలిగిస్తుంది. మీరు భయాందోళనకు గురి అయ్యే ముందు జలుబు గురించి కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.

Doctor Q&As from Parents like you

 

జలుబు మరియు దగ్గు సమయంలో మా చిన్నారికి నేను ఎటువంటి ఆహారం ఇవ్వాలి?

 

మీ పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మరియు ఘన  ఆహారాన్ని తినడానికి నిరాకరిస్తున్నప్పుడు వారిక వెచ్చటిి ద్రవాలను పుష్కలంగా ఇవ్వండి.

 

మీరు మాంసాహారులు అయినట్లయితే ఎముకలను బాగా ఉడికించి ఆ సూపును ఇవ్వచ్చు.

 

శాకాహారుల కోసం కూరగాయలతో తయారు చేయగల సూపులు ఉన్నాయి.

 

వేడి రసము (దక్షిణ భారతదేశంలో అన్నంతో కలిపి తీసుకునే రసము) వెల్లుల్లి, జీలకర్ర మరియు పసుపుతో  తయారుచేసే ఈ రసం జలుబుకు అద్భుతంగా పనిచేస్తుంది.

 

అల్లం రసంలో ఒక టీస్పూన్ తేనెను కలిపి గోరువెచ్చగా ఇచ్చినట్లయితే ఇది గొంతు నొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది.

 

పిల్లలలో దగ్గు మరియు జలుబు లక్షణాలను చూడండి:

 

అధిక జ్వరం లేదా శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది ఉన్న సందర్భంలో మీరు మీ పిల్లల శిశువైద్యుని సంప్రదించవలసి ఉంటుంది. అయితే, మీరు ఇంట్లోనే ఈ లక్షణాలను ఎలా తగ్గించవచ్చో తెలుసుకోవడానికి దీనిని చదవండి..

 

ముక్కు కారడం

 

తుమ్ములు

వాంతి వచ్చినట్లుగా ఉండడం

క్రమేణ ఆకలి తగ్గడం

గొంతు రాపిడి

గుండెల్లో బరువుగా ఉండడం (కపం)

రోజంతా మగతగా ఉండడం

 

మీ పిల్లలలో దగ్గు మరియు జలుబు కోసం గృహ నివారణలు:

 

మీ పిల్లలు జలుబుతో బాధపడుతున్నప్పుడు సహాయపడే కొన్ని సాధారణ గృహ నివారణలు ఇక్కడ ఉన్నాయి.

 

1. ఆపిల్ జ్యూస్ :

ఆపిల్ జ్యూస్ తయారీ విధానం:

ఆపిల్ను తొక్కతీసి నాలుగు ముక్కలుగా కట్ చేసి అరగ్లాసు నీరు పోసి ప్రెషర్ కుక్కర్లో ఉడికించండి.

అవును! చాలా కుటుంబాలలో పురాతన కాలం నుండి ఇస్తూఉన్న , ఈ జ్యూస్ రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. మరియు మీ బిడ్డను అలర్జీల నుండి రక్షిస్తుంది.

 

పేరేంటూన్ చిట్కా : ఆరు నెలల వయస్సు కంటే ఎక్కువగా ఉన్న పసిపిల్లలకు పాల కంటే ముందుగా ఈ రసాన్ని మొదటి ఆహారంగా ఇవ్వడం మంచిది.

 

2. జాజికాయ (జైఫాల్)

భారతీయ ఆహార పదార్థాలలో వాసన మరియు రుచిని పెంచడానికి ఉపయోగించే ప్రసిద్ధమైన మసాలా దినుసు. దీనిలో ఉన్న ఎన్నో ఔషధగుణాల వల్ల దీనిని నివారణకు ఉపయోగించవచ్చు.

 

మీ పిల్లలకు జాజికాయను ఎలా ఇవ్వాలి :

జాజికాయను గంధపు చెక్కపై పాలతో కలిపి మృదువైన పేస్ట్లా తయారు చేసి పిల్లలకు ఇవ్వండి.

దీనిని పిల్లలకు రోజుకు రెండుసార్లు ఇవ్వవచ్చు (8 గంటల సమయంలో)

 

నవజాత శిశువులకు కూడా దీనిని ఇవ్వవచ్చు . కానీ తక్కువ పరిమాణంలో ఇవ్వాలి.

 

మోతాదు - 2 సంవత్సరముల వయస్సు వారికి ఒక చెంచా!

 

3. కుంకుమపువ్వు (కేసర్):

అందాన్ని పెంచే లక్షణాలకు పేరుగాంచిన ఈ ఖరీదైన మసాలా దినుసు ఔషధ లక్షణాలు కూడా కలిగి ఉంటుంది.

 

మీ పిల్లలకు కుంకుమ పువ్వు ఎలా ఇవ్వాలి?

 

ఒక్క రెబ్బ కుంకుమపువ్వును రెండు టీ స్పూన్ల పాలలో కనీసం రెండు గంటలపాటు నానబెట్టాలి.

రెండు గంటల తర్వాత ఆ పాలను బాగా కలిపి దానిని మీ పిల్లల పాలలో చేర్చి త్రాగడానికి ఇవ్వండి.

ఇలా ప్రతి రోజూ చేసినట్లయితే ఒక్క వారం రోజుల్లో మీరు దాని ప్రభావాన్ని చూస్తారు.

 

4. పసుపు పాలు (హల్దీ వాల దూద్):

అన్ని భారతీయ గృహాలలో చాలా తేలికగా కనిపించే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలతో కూడిన మరొక మసాలా దినుసు పసుపు. దీనిని నెమ్ముని దూరం చేయడానికి ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు.

 

పసుపు పాలు ఎలా తయారు చేయాలి?

 

పిల్లలకు ఇచ్చే పాలను పసుపు కలిపి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మరిగించండి.

 

ఆ పాలను గోరువెచ్చగా వచ్చేవరకు చల్లారనివ్వండి. ఆ తర్వాత పిల్లలకు ఇవ్వండి.

 

ఇది చాలా ప్రయోజనకరమైన పానీయము మరియు పిల్లలకు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

 

5. తులసి ఆకులు :

ఆయుర్వేదంలోని వివిధ వ్యాధులు మరియు రుగ్మతల నివారణకు విశ్వసనీయంగా ఉపయోగించే ఏకైక ఔషధము తులసి. తులసి దగ్గుకు అద్భుతంగా పనిచేస్తుంది. మరియు దీనిని వివిధ మార్గాలలో ఉపయోగించవచ్చు.

 

మీ పిల్లల కోసం తులసి ఆకులను ఎలా ఉపయోగించాలి ?

మూడు లేదా నాలుగు తులసి ఆకులను మెత్తగా దంచి వాటిని రెండు నిమిషాలపాటు ఉడకబెట్టాలి.

 

ఆ నీటిని గోరువెచ్చగా చేసి దానిలో కొంచెం తేనె కలిపి మీ పిల్లలకు ఇవ్వండి.

 

తాజా అల్లము, ఏలకులు, పసుపు, తమలపాకులు మరియు నల్ల మిరియాలను కూడా అందులో చేర్చవచ్చు.

 

ఇది మీ పిల్లలకు తక్షణ ఉపశమనంగా పనిచేస్తుంది.


ఈ క్రింది వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను మరియు సూచనలను మాతో పంచుకోండి.

Be the first to support

Be the first to share

support-icon
సహాయము కోరకు
share-icon
షేర్ చేయండి
Share it

Related Blogs & Vlogs

No related events found.