1. ఆర్ట్-&-ఎక్స్‌ట్రా-కరిక్యులర్స ...

కుమార్తెతో సురేష్ రైనా కుకింగ్ సెషన్.. ఇతర పేరెంట్స్ కు ఆదర్శం!

Age Group: 3 to 7 years

3.0M views

కుమార్తెతో సురేష్ రైనా కుకింగ్ సెషన్.. ఇతర పేరెంట్స్ కు ఆదర్శం!

Published: 22/07/22

Updated: 22/07/22

ఆర్ట్ & ఎక్స్‌ట్రా కరిక్యులర్స్
జీవన నైపుణ్యాలు
అభిరుచి తరగతులు

తన ఆరేళ్ల కూతురు గ్రేసియా రైనా, తన తల్లి ప్రియాంక చౌదరి రైనా కోసం ఎలా వండిందో ప్రముఖ క్రికెటర్ సురేశ్ రైనా ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ ద్వారా షేర్ చేసారు. కుమార్తెతో సురేష్ రైనా చేసిన వంట సెషన్, ఇతర పేరెంట్స్ కి ఫామిలీ గోల్స్ ఇస్తోంది. ఆదర్శంగా నిలిచింది. మన పిల్లలు అభిరుచులు మరియు ఆసక్తులతో ఎదగాలని మనమందరం కోరుకుంటా౦.  కాబట్టి వారు ఒక నిర్దిష్ట అభిరుచిని, హాబీని  కలిగి ఉంటే, మనం దీన్నిప్రోత్సహించాలి. మీ చిన్నారి ఒక అప్కమింగ్ చెఫ్‌అయితే, దానిని అంగీకరించండి. సురక్షితమైన వాతావరణంలో వారు కుకింగ్ గురించి మరింత తెలుసుకోవడానికి వారికి సహాయపడండి.  వాస్తవానికి, వారు  ఎలాంటి ప్రమాదంలో పడకుండా చూసుకోవడానికి, వారిపై నిఘా ఉంచడానికి మీరు  ఎల్లప్పుడూ దగ్గరగా ఉండాలి. మీ పిల్లలను మీతో పాటు వంటగదిలోకి తీసుకురావడానికి కొన్ని మార్గాలను ఇక్కడ సిద్ధం చేసాము.

ఇద్దరూ కలిసి ఉత్తమ వంటకాల లిస్టు తయారుచేయండి

అన్నింటిలో మొదటిది, కొన్ని పిల్లల అనుకూలమైన వంటకాలు అవసరం. మీరు ఒక అందమైన రెసిపీ బుక్ ఉంటె, మీరు మరియు మీ పిల్లలు కలిసి దానిలో వంటకాలను వ్రాయవచ్చు. పోనుపోను మీరు వాటికి జోడించడం, అడ్జస్ట్ చేయడం  చేయవచ్చు. ప్రయోగాలు చేయండి 

పిల్లలు కొత్త విషయాలను ప్రయత్నించడానికి ఇష్టపడతారు. కాబట్టి వారికి వారి స్వంత ఆలోచనలు ఉన్నాయోమో చూడండి. మీరు వారు చెప్పేది వింటూ, వారితో కలిసి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే, అది వారికి ప్రోత్సాహంగా ఉంటుంది.  వారికి కొన్ని గొప్ప ఆలోచనలు ఉండవచ్చు, వారు ఒక గొప్ప  వంటకాన్ని కనుగొనవచ్చు.  కోరుకున్న విధంగా అలంకరించడానికి మరియు ప్రదర్శించడానికి వారిని ప్రయత్నించనివ్వండి. వారు వంట విషయంలో సీరియస్‌గా ఉంటే, ప్రెజెంటేషన్ కూడా అంతే ముఖ్యం!

కిచెన్ గేర్‌ బహుమతులు ఇవ్వండి

'చెఫ్' అనే పదంతో పాటు వారి పేరు ఉన్న రోలింగ్ పిన్ లేదా చాపింగ్ బోర్డ్‌ను వారికి బహుమతిగా ఇవ్వడానికి ట్రై చేయండి. వారి చెఫ్ అవతారాన్ని పూర్తి చేయడానికి మీరు చెఫ్ టోపీ మరియు ఆప్రాన్‌ను కూడా వారికి ఇవ్వచ్చు. మీరు ఈ విధంగా వారికి మద్దతివ్వడాన్ని వారు ఇష్టపడతారు. 

Doctor Q&As from Parents like you

కుకింగ్ షోలను చూడండి

మాస్టర్ చెఫ్ తెలుగు, అభిరుచి లేదా వా రే వాహ్ అయినా, ఇలాంటి వంట కార్యక్రమాలను  కలిసి చూడటం వలన వంటగదిలో ఎలా నడుచుకోవాలో అలాగే ఎలా చేయకూడదో వారికి స్ఫూర్తినిస్తుంది. ఈ షోల ద్వారా మీరు వెరైటీ  రెసిపీ ఆలోచనలను కూడా పొందవచ్చు. ఆపై మీరిద్దరూ కలిసి అద్భుతమైన వంటకాలను సృష్టించడానికి ప్రయత్నించవచ్చు.

వారిని కుకింగ్ క్లాస్ లో జాయిన్ చేయండి

మీరు వారితో కల్సి కొద్దిసేపు వండిన తర్వాత, వారు దానిని ఆస్వాదించి, వంట చేయడం లేదా బేకింగ్ చేయడం గురించి సీరియస్ గా  ఆలోచిస్తే, నిపుణుల నుండి నేర్చుకునేందుకు  వీలుగా వారికి కుకింగ్ క్లాస్ లో జాయిన్ చేయాలి. ఏమో, ఇది వారి విజయవంతమైన కెరీర్ కి నాంది కావచ్చు కూడా!

మీరు మీ పిల్లలతో కలిసి వంట చేస్తున్నప్పుడు వంటగది పనులన్నీ వారి వయస్సుకు తగినవిగా ఉండాలి. మీరు వారితో కలసి వంటగదిని వారికి  పరిచయం చేయడం, వారు కుకింగ్ నేర్చుకునేటట్లు చేయడానికి  ఒక అద్భుతమైన అవకాశం. వారి నైపుణ్యాలను మెరుగుపరచండి. ఇంకెందుకాలస్యం..  మీ అప్రాన్‌లు మరియు చెఫ్ టోపీలను ధరించండి ఇక  ఈ రోజే వంటగదిలో  తుఫాను సృష్టించడం ప్రారంభించండి!

Be the first to support

Be the first to share

support-icon
సహాయము కోరకు
share-icon
షేర్ చేయండి
Share it

Related Blogs & Vlogs

No related events found.