1. వర్షాకాలంలో శిశువు యొక్క నడినె ...

వర్షాకాలంలో శిశువు యొక్క నడినెత్తి (మాడు) మరియు చర్మ సంరక్షణ

Age Group: All age groups

6.0M views

వర్షాకాలంలో శిశువు యొక్క నడినెత్తి (మాడు) మరియు  చర్మ సంరక్షణ

Published: 22/07/20

నేను మొదటిసారిగా మా పాపని చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆమె చర్మం ఎంత మృదువుగా ఉందొ ! వెన్న లాగే ! పసిపిల్లలు అద్భుతమైన, మృదువైన చర్మం తో ఆశీర్వదించ బడతారు. అదే సమయంలో చాలా సున్నితంగా, శ్రద్ధగా వారి చర్మాన్ని సంరక్షించ వలసిన అవసరం ఉంటుంది.

 

వేడి మరియు ఉక్క తో కూడుకున్న ఈ వాతావరణంలో లో దద్దుర్లు , వేడి పొక్కులు, చుండ్రు వంటి చర్మ సంబంధమైన సమస్యలు సులభంగా తలెత్తుతాయి. అయితే కొన్ని సాధారణ శిశు సంరక్షణ పద్ధతులను అనుసరించడం ద్వారా ఇంట్లోనే ఇటువంటి సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు.

 

శిశువులలో తలెత్తే మాడు ఎండిపోవడం మరియు చుండ్రు లాంటి సమస్యలు...

 

Doctor Q&As from Parents like you

శిశువులలో చుండ్రు అనేది చాలా సాధారణంగా వస్తుంటుంది.నవజాత శిశువులలో చుండ్రు కొత్త కొత్త రూపాలలో కనిపిస్తూ ఉంటుంది. ఇది వారి నెత్తి మీద పొలుసుల లాగా కనిపిస్తూ ఉంటుంది. వారి తల మీద వచ్చే పొలుసులను నయం చేసేందుకు ఎన్నో షాంపూల కోసం నేను పరిశోధన మొదలు పెట్టాను. కానీ మా శిశువైద్యుడు చుండ్రు మరియు తల మీద వచ్చే పొలుసులకు చికిత్స చేయడం కోసం చాలా  సులభమైన పరిష్కారాలు సూచించారు. ఇవి వారి దినచర్యలో చాలా సులభమైనది మరియు ప్రయోజనకరమైనవి.

 

మీకు కావలసినవి :

కొబ్బరి నూనె,

సాఫ్ట్ బేబీ బ్రష్ ( బేబీ దువ్వెన మరియు బ్రష్ సెట్ను ఉపయోగించాను)

 

విధానము :

 

1. శిశువుల తలకు కొబ్బరి నూనెను రాసి రెండు మూడు గంటల పాటు ఉంచండి.

 

2. జట్టు నుండి నూనెను తొలగించడానికి శిశువు జుట్టును షాంపూతో శుభ్రపరచండి.

 

3. షాంపూ చేసిన తర్వాత జుట్టుని శుభ్రంగా ఆర నివ్వండి.

 

4. బేబీ దువ్వెనతో పొలుసు లాంటి చుండ్రు పోయేవరకు సున్నితంగా దువ్వండి.

 

ఈ సులభమైన దశలు మీ శిశువు తల మీద పొక్కులు మరియు చుండ్రు తొలగించడానికి సహాయపడటం కాకుండా మళ్ళీ తిరిగి రాకుండా కూడా నిరోధించగలవు. ఒక చిన్న సలహా... శిశువు తలపై నూనెను రెండు లేదా మూడు గంటలకు మించి ఎప్పుడూ ఉంచవద్దు. అలా ఉంచినట్లయితే  శిశువు యొక్క తలలో దుమ్ము , ధూళి చేరి అవసరమైన రంధ్రాలను అడ్డుకోవడానికి దారితీస్తుంది. అదేవిధంగా శిశువు తల మీద గోకడం లాంటివి చేయకండి. అది మీ బిడ్డను బాధ పెడుతుంది.

 

డైపర్ దద్దుర్లు :

 

తేమతో కూడిన వాతావరణం శిశువులకు చాలా రకమైన దద్దుర్లను కలిగిస్తుంది . డైపర్ దద్దుర్లు అందులో ఒక భాగము. మా పాప మొదటి రోజు నుండి నేను డైపర్ను ఉపయోగిస్తున్నాను. అదే సమయంలో  మా చిన్నారి కి డైపర్ వాడకం వలన దద్దుర్లు రాకుండా ఉండటానికి నేను చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది.

 

1. డైపర్ ను రెండు లేదా మూడు గంటలకు మించి ఉంచవద్దు . డైపర్ లను ఎక్కువసేపు వాడటం వల్ల చర్మం పై దురద మరియు శిశువుల సున్నితమైన ప్రాంతాలపై గాట్లు ఏర్పడతాయి.

 

2. శిశువుకు ఉదయము మరియు సాయంత్రము రెండు మూడు గంటల పాటు డైపర్ వేయకుండా వదిలేయండి. మా స్నేహితులు ఎంతోమంది వారి పిల్లలకు ఇంట్లో డైపర్ వేయకుండానే చూసుకో గలుగుతున్నారు . మరియు రాత్రి పూట లేదా బయటకు వెళ్లే సమయంలో మాత్రమే డైపర్ వాడడాన్ని పరిమితం చేస్తున్నారు. అలా చేయడం కష్టంగా అనిపిస్తుంది . కానీ చేయగలిగితే మంచిది.

 

3. మలవిసర్జన తర్వాత శుభ్రపరచడం .. మల విసర్జన చేసిన తర్వాత తుడవడం కంటే కూడా నీటితో శుభ్ర పరచడం ఎంతో మంచిది. ఈ చిన్న పని చేయగలిగితే మాత్రం డైపర్ వల్ల వచ్చే దద్దుర్లు రాకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఇది డైపర్లు వల్ల వచ్చే దద్దుర్లను దూరం చేస్తుంది.

 

మీ శిశువును ఎల్లప్పుడు శుభ్రంగా మరియు

పొడిగా ఉంచుకోవాలని నిర్ధారించుకోండి. మరియు డైపర్ దద్దుర్లు నుండి వారిని దూరంగా ఉంచండి.

 

చర్మ సంరక్షణ :

 

వేడి మరియు ఉక్కపోత గా ఉన్న ఈ పరిస్థితులలో మీ శిశువు యొక్క చర్మాన్ని మరీ చల్లగా గాని , పొడిగా గానీ లేకుండా చూసుకోండి. ఎక్కువ వేడి చేసినట్లయితే ముఖంపైన చిన్న చిన్న వేడి పొక్కులు లాంటివి వస్తాయి. చర్మం పొడిబారకుండా ఉండడానికి మార్కెట్లో ఎన్నో రకాల బేబీ క్రీమ్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఆ క్రీములను ఉపయోగించకూడదు అనుకుంటే మాత్రం ఇంట్లోనే తయారు చేసిన వెన్నను ఉపయోగించడం ఎంతో మంచిది. స్నానం చేయించడానికి ముందు ప్రతిరోజు ఆలివ్ ఆయిల్తో మసాజ్ చేయడం వలన కూడా శిశువు చర్మాన్ని మృదువుగా ఉంచి, చర్మ సమస్యల నుండి కాపాడడానికి ఉపయోగపడుతుంది. ఇది శిశువుల్లోని అతి సన్నటి దుమ్మును కూడా తొలగించడానికి సహాయపడుతుంది. మరియు తల్లులకు కూడా మంచి బాంధవ్యాన్ని పెంచుకునేందుకు ఉపయోగపడుతుంది.

 

రాబోవు వాతావరణంలో , నొప్పితో కూడిన దద్దుర్లు మరియు ఇతర చర్మ సమస్యల నుండి శిశువులను కాపాడుకునేందుకు  ఈ సూచనలు మీకు సహాయపడతాయని ఆశిస్తున్నాము.

 

మీ అందరికీ శుభాకాంక్షలు !












 

 

 

Be the first to support

Be the first to share

support-icon
సహాయము కోరకు
share-icon
షేర్ చేయండి
Share it

Related Blogs & Vlogs

No related events found.