1. జననం---డెలివరీ

గర్భవతులు నేరేడు పండు తినడం సురక్షితమేనా?

Pregnancy

Ch  Swarnalatha

2.6M వీక్షణలు

3 years ago

గర్భవతులు నేరేడు పండు తినడం సురక్షితమేనా?

Only For Pro

blogData?.reviewedBy?.name

Reviewed by expert panel

Parentune Experts

జననం - డెలివరీ

ఎన్నో ఔషధ విలువలున్న నేరేడుపండును ఇంగ్లీష్లో బ్లాక్ ప్లం లేదా జావా ప్లం అని, హిందీలో జామూన్ అని, సంస్కృతంలో జంబూ ఫలం కూడా పిలుస్తారు.  ఇది భారతదేశంలో ఒక ప్రసిద్ధ పండు. ఇది అంతులేని ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. ఇక  గర్భధారణ సమయంలో మహిళలకు రకరకాల కోరికలు కలగడం చాలా సాధారణం.  మరి మీరు నేరేడు తినాలని ఆరాటపడుతుంటే, 'జామూన్ తినడం సురక్షితమా  కాదా' వంటి కొన్ని ప్రశ్నలు మీకు ఎదురుకావచ్చు. కాబట్టి, ఈ సందేహమనే బుడగను విచ్ఛిన్నం చేయడంలో మీకు సహాయపడటానికి, గర్భం దాల్చిన వారికి జామున్ సురక్షితమేనా అని అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడే ఒక ఉపయోగపడే ఒక గైడ్, మీకోసం.. 

గర్భవతులు నేరేడు  తినడం  నిజంగా సురక్షితమేనా?

ఔను, కాబోయే తల్లులకు నేరేడు పూర్తిగా సురక్షితము. ఈ పండులో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున ఇది కడుపులో ఉన్న బిడ్డ సంపూర్ణ అభివృద్ధి,  శ్రేయస్సులో కీలక పాత్ర పోషిస్తుంది.

గర్భధారణలో జామున్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

Doctor Q&As from Parents like you

గర్భధారణ సమయంలో నేరేడు పండు తీసుకోవడం వల్ల కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఇక్కడ చూడండి-

ఆరోగ్యకరమైన పోషకాల ప్రొఫైల్ - ఇప్పటికే పైన చెప్పినట్లుగా, జామూన్ పోషకాలు మరియు యాంటీఆక్సిడెంట్లకు నెలవు.  ఇది విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం మరియు వివిధ యాంటీఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది. ఈ ముఖ్యమైన పోషకాలు మీ రోగనిరోధక వ్యవస్థ మరియు ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది- మీ ఆహారంలో నేరేడును జతచేయడం వల్ల కలిగే మరో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే ఇది అల్సర్ మరియు డయేరియా చికిత్సలో సహాయపడుతుంది. ఇది ఇరిటబుల్ బోవేల్ సిండ్రోమ్ యొక్క లక్షణాలను తగ్గించడానికి  కూడా సహాయపడుతుంది.

రక్తపోటు తగ్గిస్తుంది: జామున్ యొక్క మరొక ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే ఇది అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ పండు యాంటీఆక్సిడెంట్లు మరియు పొటాషియంకు 

అద్భుతమైన మూలం. ప్రెగ్నెన్సీ అనేది మీకు ఎక్కువ మొత్తంలో శక్తి అవసరమయ్యే సమయం. అందువల్ల, మీ ఆహారంలో జామూన్‌ను చేర్చడం ద్వారా మీరు అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో ఒక అడుగు ముందుకు వేసినట్టే.  మీరు 100 గ్రాముల నేరేడు  నుండి 50 mg పొటాషియం పొందవచ్చు.

రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది - నేరేడు మీ రోగనిరోధక శక్తిని చాలా వరకు పెంచుతుంది. ఇందులో అనేక యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి మీ శరీరాన్ని వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి. ఇది RBC కౌంట్‌ను మరింత పెంచుతుంది తద్వారా రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది - ముఖ్యంగా హృదయ ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు, జామున్ రక్తపోటు స్థాయిలను చాలా వరకు తగ్గిస్తుంది. ఇది భవిష్యత్తులో గుండెపోటు రాగల  ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది మంటను మరింత తగ్గిస్తుంది, తద్వారా మీ గుండె నాళాలను రక్షిస్తుంది మరియు సంరక్షిస్తుంది.

ప్రీమెచ్యూర్ డెలివరీని నివారిస్తుంది - చివరగా, నేరేడు మెగ్నీషియంకు గొప్ప మూలం. ఇది అకాల ప్రసవాలను నివారించడానికి అవసరమైన ముఖ్యమైన పోషకం. ఇది గర్భస్థ శిశువు  యొక్క పూర్తి మరియు సమగ్ర పెరుగుదలను నిర్ధారిస్తుంది.

Be the first to support

Be the first to share

support-icon
సహాయము కోరకు
comment_iconComment
share-icon
షేర్ చేయండి
share-icon

Related Blogs & Vlogs

No related events found.