1. మాయ (ప్లాసెంటా )కిందకు జారడం . ...

మాయ (ప్లాసెంటా )కిందకు జారడం ...మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

Pregnancy

Aparna Reddy

5.5M వీక్షణలు

5 years ago

మాయ (ప్లాసెంటా )కిందకు జారడం ...మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

మీ డాక్టరు మీకు మాయ కిందకు జారింది అని చెప్పినట్లయితే మీరు కొన్ని రోజులు తేలికగా తీసుకోండి.  కానీ మీరు ఆందోళన చెందుతారు. అసలు మావి జారడం అంటే ఏమిటి ?మీలోని ఆందోళనలను గురించి మర్చిపోండి.  మీకు మావి అంటే ఏమిటో కూడా తెలియదు. అప్పుడు మీరు మావి అంటే ఏమిటో తెలుసుకునేందుకు ఇంటర్నెట్లో వెతకడం మొదలు పెడతారు. అందుకే అసలు మావి అంటే ఏమిటి మరియు మావి క్రిందకు జారి పోవడం అంటే ఏమిటి ?

Advertisement - Continue Reading Below

 

మావి (ప్లాసెంటా)అనేది గర్భధారణ సమయంలో స్త్రీ గర్భంలో అభివృద్ధి చెందే ఒక అవయవము . పెరుగుతున్న పిండానికి ఆక్సిజన్ ను మరియు ఆహారాన్ని అందించే బాధ్యత మావి నెరవేరుస్తుంది.

 

గర్భం దాల్చిన తర్వాత అండం గర్భాశయం లో ఎక్కడో ఒక చోట ఫలదీకరణ అవుతుంది.దాని ఉత్పత్తికి ప్రత్యేకమైన మరియు నిర్దిష్టమైన స్థానం అంటూ లేదు. అది గర్భాశయం యొక్క ముందు, వెనుక, పైన, క్రింద ఎక్కడైనా సరే ఫలదీరణ జరగవచ్చు. అండం ఫలీకరణ అయిన చోటనే మావి అభివృద్ధి చెందుతుంది.

 

మావి క్రిందికి జారడం అంటే ఏమిటి ?

 

మావి క్రిందికి జారడం అన్నది గర్భాశయ సమస్య. మావి గర్భాశయం యొక్క దిగువ భాగంలో గర్భాశయానికి దగ్గరగా ఉండి దానిని కప్పబడి ఉంటుంది.

 

మావి కిందకు జారింది అంటే అది గర్భాశయ ద్వారంని మూసివేసింది అని కాదు. (గర్భాశయం తెరుచుకునే గర్భాశయ పైభాగం) ను అది తప్పనిసరిగా మూసి వేస్తుంది అని కాదు .అది శిశువు గర్భాశయం గుండా వెళ్ళకుండా నిరోధించదు.ఆ కారణంగా మావి గర్భాశయానికి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా మామూలు ప్రసవం అన్నది సాధ్యమవుతుంది.

 

ఇది చాలా సందర్భాలలో జరుగుతుంది.   గర్భం దాల్చినప్పుడు మావి క్రిందకు జారుతుంది. అందుకే మావి తన స్థానం నుండి కదిలి అడ్డుకుంటే దానిని ప్లాసెంటా (మావి) ప్రివియా అని పిలుస్తారు.

 

 ప్లాసెంటా ప్రివియా లోని రకాలు ఏమిటి ?

 

పూర్తిగా మూయడం :

 

ఈ రకమైన మావి ప్రీవియ లో గర్భాశయ ప్రారంభం నుండి  గర్భాశయం మొత్తాన్ని మూసి వేస్తుంది.

 

పాక్షికం (కొంత భాగాన్ని మూయడం):

 

ఈ రకమైన మావి ప్రీవియా గర్భాశయం యొక్క ద్వారాన్ని కొంత భాగం మాత్రమే మూసి ఉంచుతుంది.

 

మార్జినల్ (చివరి భాగాన్ని)

 

ఈ రకమైన మావి ప్రీవియ లో మావి గర్భాశయ ప్రారంభానికి దగ్గరగా, దాని అంచును ఆనుకొని ఉంటుంది. కానీ ద్వారాన్ని మూసి వేయదు.

 

మావి ప్రీవియ మరియు  అంటేరీర్ ప్లాసంటా రెండు ఒకటేనా ?

 

మీ డాక్టరు మీకు అంటేరీర్ ప్లాసంటా అని చెప్పినంత మాత్రాన మీరు భయపడవలసిన అవసరం లేదు. అవి రెండూ కూడా ఒకేలా ఉండవు. మరియు అంటేరీర్ ప్లాసంటా ఎటువంటి ప్రమాదాలను కలిగించదు. ఈ మావి గర్భాశయానికి ముందు భాగంలో ఉంటుంది అని అర్థం. అది గర్భాశయం యొక్క వెనుక భాగానికి అతకడానికి బదులుగా మీ బొడ్డు వైపున ఉంది అని అర్థం. అది చాలా సాధారణం.

 

మావి ప్రివియ ఎంత సాధారణం ?

 

Advertisement - Continue Reading Below

మావి ప్రివియ ప్రతి వెయ్యి మంది గర్భిణీలలో నలుగురికి ఉన్నట్లుగా ధ్రువీకరించారు.  అది చాలా సాధారణమైనది.  ముందుగా పిల్లలు ఉన్న వారి విషయంలో దీని రేటు పెరుగుతూ ఉంటుంది. (ప్రతి 90 మందిలో ఒకరికి) అదేవిధంగా, ప్రసవ సమయంలో దీని రేటు 250 మందిలో ఒకరికి తగ్గుతుంది.

 

మావి ప్రివియ మరియు  మావి క్రిందకు జారడానికి గల కారణాలు ఏమిటి ?

 

మావి క్రిందకు జారడానికి కారణాలు ఇంతవరకు తెలియరాలేదు.  ఏది ఏమైనా  మావి క్రిందకు జారడం వల్ల అనేక రకాలైన ప్రమాదాలు పొంచి ఉన్నాయి.

 

మాయ కిందకు జారినట్లుగా ఎలా నిర్ధారిస్తారు ?

 

సాధారణంగా మా యొక్క స్థానాన్ని గర్భందాల్చిన 20 వారాల సమయంలో యాంటేనాటల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా

గుర్తించబడుతుంది.  గర్భాశయం యొక్క దిగువ భాగంలో మావి ఉన్నట్లుగా సంకేతాలను మొదటిసారిగా డాక్టర్ కనుగొన్నప్పుడు, లేదా గర్భిణీ స్త్రీకి రెండవ త్రైమాసికంలో నొప్పిలేకుండా రక్తస్రావం ఎదురైతే, డాక్టర్ ట్రాన్స్ వాజినల్  స్కాన్ చేస్తారు.అందులో మాయ క్రిందకు దారి ఉన్నట్లుగా లేదా మాయ ప్రివియా గుర్తించినట్లయితే యోని లోపలి భాగంలో ప్రోబ్ ఉంచబడుతుంది.

 

పరిస్థితి నిర్ధారించిన తర్వాత కూడా డాక్టర్  గర్భందాల్చిన 32వ వారంలో మరో స్కాన్ కోసం వెళ్తారు.  అనేక సందర్భాల్లో ఈ మావి గర్భాశయం నుండి పైకి మరియు దూరంగా కదిలినట్లు గా స్కాన్ ద్వారా గుర్తిస్తారు. అయితే మీకు  మావి ప్రివియ ఉన్నట్లయితే ముందు సిజేరియన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

 

క్రిందకు జారిన మావి యొక్క పరిణామాలు ఏమిటి ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

 

మాది క్రిందకు జారడం వలన అనేక సమస్యలు ఉండవచ్చు.  మావి క్రిందకు జారిన  తల్లులు సాధారణంగా అనుభవించే కొన్ని సందర్భాల జాబితాను మీ ముందు ఉంచుతున్నాను.

 

మావి క్రిందకు జారడం వలన ఏర్పడే ప్రధానమైన సమస్య రక్తస్రావం. మావి యొక్క స్థానాన్ని బట్టి ఇది తక్కువ,. ఎక్కువ మరియు లేదా ఆగకుండా రక్తస్రావం కావచ్చు. వైద్యులు సాధారణంగా మావి ప్రివియ విషయంలో గర్భిణీ స్త్రీలను ప్రయాణము మరియు సంభోగం విషయంలో పూర్తిగా లేదా పాక్షికంగా పరిమితం చేస్తారు.

 

ఎక్కువ రక్తస్రావం అవుతుంటే మాత్రం పూర్తి విశ్రాంతి అవసరం.

 

ఎక్కువ రక్తస్రావం అవుతున్నట్లయితే తల్లిని హాస్పిటల్లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచి అవసరమైతే రక్త మార్పిడి చేయవలసి ఉంటుంది .బిడ్డ యొక్క హృదయ స్పందన కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి .అధిక రక్తస్రావం వలన పిండానికి ఎటువంటి ప్రమాదం లేదని నిర్ధారించుకోండి.

 

అనియంత్రిత రక్తస్రావం అవుతున్నట్లు అయితే గర్భం యొక్క వారాల తో సంబంధం లేకుండా తల్లి ప్రాణాలను రక్షించడానికి అత్యవసర సి -సెక్షన్ అవసరం ఉంటుంది.

 

మావి ప్రీవియ యొక్క తీవ్రతను బట్టి నిర్ణయ తేదీ కంటే కూడా ముందుగానే సి -సెక్షన్ అవసరం ఉంటుంది.  తద్వారా ముందుగానే ప్రసవం అయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఈ సందర్భంలో శిశువు యొక్క ఊపిరితిత్తుల పెరుగుదలను వేగవంతం చేసేందుకు కార్టికో స్టెరాయిడ్స్ ఇంజక్షన్ ఇవ్వవచ్చు.

 

అంతర్గత రక్తస్రావము, డెలివరీ సమయంలో తీవ్రమైన రక్తస్రావము, మరియు డెలివరీ అయిన తర్వాత కూడా అధిక రక్తస్రావము మాయ  కిందకు జారడం వలన జరిగే పరిణామాలు.

 

మాయ బాగా కిందకు జారి పోయిన అట్లయితే (పి పి ఆర్ వో ఎం) ఆకస్మిక ముందస్తు ప్రసవానికి దారితీస్తుంది.

 

మాయ కిందకి జారి పోవడం అనే బ్లాగు మీకు నచ్చిందా? ఇలా మావి లోపలకు జారిపోయి బాధపడుతున్నా లేదా బాధపడిన వారు ఎవరైనా మీకు తెలుసా ? ఏ జాగ్రత్తలు తీసుకున్నారు ? దిగువ వ్యాఖ్యల విభాగంలో వాటిని మాతో పంచుకోండి.  అవసరం అయిన తల్లులు వాటి నుండి కొన్ని సలహాలను ఆచరిస్తారు.










 

    

       

 

Be the first to support

Be the first to share

support-icon
Support
share-icon
Share

Comment (0)

share-icon

Related Blogs & Vlogs

No related events found.

Loading more...