1. గర్భధారణ సమయంలోని నిర్ధారించబడ ...

గర్భధారణ సమయంలోని నిర్ధారించబడిన 7 ముఖ్యమైన ఆహారపు అపోహలు.

Age Group: Pregnancy

5.1M views

గర్భధారణ సమయంలోని నిర్ధారించబడిన 7 ముఖ్యమైన ఆహారపు అపోహలు.

Published: 17/11/20

Updated: 17/11/20

1 అపోహ : ఇద్దరి కోసం తినడం.

 

వాస్తవం :

గర్భధారణ సమయంలో శక్తి మరియు ప్రోటీన్ యొక్క అవసరం పెరిగినప్పటికీ ఆ సమయంలో ఇద్దరికీ సరిపడా ఆహారం తీసుకోకూడదు.దానికి బదులుగా మంచి నాణ్యత గల ప్రోటీన్లతో కూడిన సమతుల్యమైన ఆహారం పై దృష్టి పెట్టడం మంచిది.

ఏమి చేయాలి - మీరు మామూలుగా తీసుకునే సమతులాహారం తో పాటుగా పప్పు ,చిక్కుళ్ళు , చికెన్ , ఫిష్ వంటి ఆహారాలను కొంచం అధికంగా తీసుకోండి. అదే విధంగా ప్రతి రోజూ ఒక గ్లాసు పాలను తీసుకోవడం వలన మీ ప్రోటీన్ మరియు క్యాల్షియం అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుంది.

 

Doctor Q&As from Parents like you

2 అపోహ : బొప్పాయి గర్భస్రావం కలిగిస్తుంది:

 

వాస్తవం :

ఆకుపచ్చని లేదా పండని బొప్పాయి లో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. పండని బొప్పాయిని ఎక్కువగా తినడం వలన అనియంత్రిత గర్భస్రావానికి కారణం అవుతుంది. దీనిలోని ఈస్ట్రోజన్ స్థాయి గర్భస్రావాని దారి తీస్తుంది.

మరోవైపు, పండిన బొప్పాయిలో బీటా-కెరోటిన్ (విటమిన్ ఎ), పొటాషియం మరియు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పోషక సహకారం కోసం దీనిని తక్కువ మొత్తంలో తీసుకోవచ్చు.

 

ఏమి చేయాలి - పండని బొప్పాయిని నివారించండి. మీరు బొప్పాయిని బాగా ఇష్టపడుతూ దానిని మాన లేకుండా ఉన్నట్లయితే వారానికి ఒకటి , రెండు సార్లు తక్కువ మోతాదులో తీసుకోండి.

 

3 అపోహ : పైనాపిల్ గర్భస్రావం కావడానికి కారణం కావచ్చు :

 

వాస్తవం :

 పైనాపిల్ లో  బ్రో మేలైన్ అనే ప్రోటియోలైటిక్ (ప్రొటీన్లను కలిగించే) ఎంజైమ్ ఉంటుంది . ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ.ఇప్పటి వరకు దీని గురించి సరైన వివరణ లేనందువలన గర్భధారణ సమయంలోనూ మరియు తల్లి పాలు ఇచ్చే సమయంలో దీన్ని నివారించడం మంచిది.

 

4 అపోహ : మామిడి పండ్లు, డ్రై ఫ్రూట్స్, ధాన్యాలు వంటి వేడిని కలిగించే ఆహారాన్ని మానుకోవాలి . ఎందుకంటే , దీని వలన రక్త స్రావం జరగవచ్చు.

 

వాస్తవం :

ఈ ఆహారాలను మితంగా తీసుకోవచ్చు. మామిడిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది . ఇది గర్భధారణ సమయంలో ఎంతో అవసరం . అదేవిధంగా డ్రైఫ్రూట్స్ మరియు ధాన్యాలలో జింక్ , విటమిన్ ఇ,  ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల వంటి అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి.

ఏమి చేయాలి - ముందురోజు రాత్రి వాటిని నీటిలో నానబెట్టి ఆ తరువాత తీసుకోవచ్చు.

 

5 అపోహ : కాఫీ మరియు ఇతర కెఫిన్ పానీయాలకు దూరంగా ఉండాలి.

 

వాస్తవం :

కెఫిన్ మావిని దాటి పిండం ప్రసరణ లోకి ప్రవేశిస్తుంది. ఎక్కువగా కాఫీ ను తీసుకోవడం వల్ల అకాల ప్రసవాలు మరియు శిశువులు బలహీనంగా పుట్టడానికి దారి తీస్తుంది. గర్భధారణ సమయంలో వీటిని (టి, కాఫీ, కోకో, కోలా) ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది.

ఏమి చేయాలి : మీరు కాఫీని తీసుకోవడం రోజుకి రెండు కప్పులకు పరిమితం చేయండి.

 

6 అపోహ : గర్భధారణ సమయంలో చేపలను నివారించాలి.

 

వాస్తవం : ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభించే వాటిలో చేపలు ముఖ్యమైనవి. ఇది పిండం యొక్క మెదడు మరియు రెటీనాలను బలపరిచే స్థిరమైన వనరులు. కానీ కొవ్వు చేపలు పాదరసంతో కలుషితం కావచ్చు. ఇది పిల్లల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.

ఏమి చేయాలి - మీరు ఒమేగా-3 అవసరాలను తీర్చడానికి తక్కువ పాదరసం గల చేపలను వారానికి రెండు సార్లు 100 నుండి 150 గ్రాముల చొప్పున తీసుకోవచ్చు. ఒమేగా 3 ఫ్యాటి ఆసిడ్ల కోసం ఇతర సురక్షితమైన ప్రత్యామ్నాయాలు కూరగాయల నూనెలు మరియు అవిసె గింజలు.

 

7 అపోహ : నెయ్యి లోని మృదుస్వభావం మామూలు ప్రసవానికి సహాయపడుతుంది.

 

వాస్తవం :

దీనికి మద్దతు ఇవ్వడానికి వైద్యపరమైన ఆధారాలు ఏమీ లేవు. గర్భధారణ సమయంలో నెయ్యి ఎక్కువగా తీసుకోవడం వలన అనవసరమైన బరువు పెరుగుతారు. ఇది కీళ్ల నొప్పులు, డయాబెటిస్ లేదా రక్తపోటులకు గురి చేస్తుంది.

ఏమి చేయాలి - నెయ్యి ఎక్కువగా తీసుకోవాలి అనే సలహాలను విస్మరించండి. నెయ్యి మితంగా తీసుకోవాలి అని నిర్ధారించుకోండి.

Be the first to support

Be the first to share

support-icon
సహాయము కోరకు
share-icon
షేర్ చేయండి
Share it

Related Blogs & Vlogs

No related events found.